Payal Rajput: తగ్గని పాయల్ రాజ్ పుత్ పరువాల ఆరబోత - "ఏమైందో ఏమిటో" అంటూనే రొమాన్స్
Payal Rajput: పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ల గుండెల్లు గుభేలు మంటాయి. ఎలాంటి అందాలు చూపిస్తూ తమలో మంట పెట్టిస్తుందోనని తెగ టెన్షన్ పడిపోతుంటారు. అలాంటి కుర్రకారుకు మంచి ట్రీట్ ఇచ్చింది ఈ అమ్మడు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం మంగళవారం. ఒకే ఒక్క టీజర్ తో సినీ ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పుకున్న ఈ సినిమాపై పెద్ద బజ్ క్రియేట్ అయింది. టైటిల్ ఖరారు అయినప్పటి నుంచే ప్రేక్షకులంతా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నుంచి ఈ సినిమా నుంచి తాజాగా రెండో పాట విడుదల అయింది. ఏమయ్యిందో ఏమిటో అంటూ సాగే ఈ మెలోడీ పాటలో పాయల్ రాజ్ పుత్ తన పరువాలను ఆరబోసింది.
ఆర్ఎక్స్ 100 సినిమాను మించి మరీ రొమాన్స్ చేసింది. ఈ పాట చూసిన ప్రతీ ఒక్కరికీ ఆర్ఎక్స్ 100 సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో పిల్లా రా పాటకు పాయల్ రాజ్ పుత్ ఎంతగా రొమాన్స్ చేసిందో అంతకు మించి ఈ చిత్రంలో చేసింది. కాంతార సినిమా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ ఈ పాటకు స్వరాలు అందించారు. అలాగే చైతన్య ప్రసాద్ ఈ పాటను రాయగా.. హర్షిక దేవనాథ్ తన గాత్రాన్ని దానం చేసింది. ఈ పాట ఎంత మధురంగా ఉందో పాయల్ రాజ్ పుత్ అందాలు, రొమాన్స్ అంతకు మించి మత్తెక్కిస్తున్నాయి. ఈ పాటను చూసిన ప్రతీ ఒక్కరూ పిచ్చెక్కిపోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట గణగణ మోగాలిరాకు విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ పాట ద్వారా గ్రామ ప్రజల్లో భయాన్ని అజయ్ భూపతి చాలా చక్కగా చూపించారు. అలాగే ఈ వీడియో సాంగ్ చూస్తుంటే.. కథ గురించి కొన్ని హింట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతీ మంగళవారం రోజు ఊరులో ఓ హత్య జరుగుతుందేమోనన్న భావన కల్గుతోంది. తాజాగా విడుదల చేసిన రెండో పాటలో పాయల్ జీవితంలోని ప్రేమను చూపించారు. ఈ పాట కూడా హిట్టయ్యేలా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.

మంగళవారం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ట్రైలర్ కూడా విడదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. నవంబర్ 17వ తేదీన సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు. హర్రర్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నందితా శ్వేతా, దివ్యా పిళ్ళై, అజేయ గోష్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్ తదితరులు నటించారు. అలాగే స్వాతి గునుపాటి, సురేష్ వర్మ, అజయ్ భూపతి స్వయంగా నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి తన సొంత బ్యానర్ ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ పతాకాలపై తెరకెక్కించబోతున్న మూడో చిత్రమే ఈ మంగళవారం.



Click it and Unblock the Notifications











