రొమాంటిక్ మూడ్‌లో సూర్య.. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ హైలెట్
తమిళ, తెలుగు భాషల్లో సరిసమానమైన ఫాలోయింగ్, క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో సూర్య. తమిళ మార్కెట్‌ను ఎంతగా ప్రభావితం చేయగలడో.. టాలీవుడ్‌లోనూ అంతే హవా చూపించగలడు. అయితే గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేకపోవడంతో కాస్త వెనుకబడ్డాడు. ఎన్ని ప్రయత్నాులు చేసినా ఓ హిట్టు కొట్టలేకపోతున్నాడు.
ఎన్నో అంచనాలతో వచ్చిన ఎన్‌జీకే, బందోబస్త్ సినిమాలు బోల్తా కొట్టాయి. విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీ రాఘవ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించిన ఎన్‌జీకే, వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో వచ్చిన బందోబస్త్ చిత్రాలు రెండూ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లాపడ్డాయి. దీంతో ఆలోచనలో పడ్డ సూర్య.. వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

'ఆకాశం నీ హద్దురా' అంటూ టైటిల్ పోస్టర్‌తోనే హంగామా చేసిన సూర్య.. టీజర్‌తో అంచనాలు పెంచేశాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. పిల్లా పులి అంటూ రిలీజ్ చేసిన వీడియో ప్రోమోలో హీరోయిన్ అపర్ణ, సూర్య కెమిస్ట్రీ అదిరిపోయినట్టు తెలుస్తోంది. చాలా రోజుల తరువాత సూర్య రొమాంటిక్ మూడ్‌లోకి వచ్చేసినట్టు కనిపిస్తోంది. ఈ మూవీ అయినా సూర్య ఆశించిన విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











