ఇరాన్‌లో హల్‌చల్ చేస్తున్న ‘పోకిరి’ సాంగ్.. ఆనంద్ మహేంద్ర కూడా ట్వీట్ చేయడంతో..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రాల్లో 'పోకిరి' ఒకటి. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు మహేశ్ కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. అందుకే ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్ కూడా అయింది. హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా 'వాంటెడ్' పేరుతో, తమిళంలో విజయ్, కన్నడంలో దర్శన్ హీరోలుగా ఒరిజినల్ టైటిల్‌తో రీమేక్ అయింది. అన్ని భాషల్లోనూ భారీ హిట్ సాధించింది.
ఇక, ఈ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకోడానికి కారణం.. అప్పుడెప్పుడో విడుదలైన ఈ సినిమాలోని ఓ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే, ఇది తెలుగు సినిమాలోది కాదు.. ఇళయదళపతి విజయ్ నటించిన 'పోకిరి'లోనిది. 'మామ్ బజా మామ్...మామ్ బజా' పాటను ఇరాన్‌లోని ఓ జిమ్ నిర్వహకులు బాగా వాడుకుంటున్నారు. వాళ్ల దగ్గరకు వచ్చే వారిని ఈ పాటతో కసరత్తులు చేపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారతదేశంలోని ఒక భాషకు చెందిన సినిమా పాట మరో దేశంలో ప్రజాదరణ పొందడం నిజంగా గొప్ప విషయమే. అందుకే ఈ విశేషాన్ని తెలుసుకున్న మన ఇండియన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహేంద్ర గ్రూప్స్ అధినేత ఆనంద్ మహేంద్ర కూడా దీనిపై స్పందించారు.
ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఆయన "ఇది నిజమేనా.! నాకిది బాగా నచ్చింది. నేను కూడా రేపటి నుండి తమిళ మ్యూజిక్‌తో నా రోజు ప్రారంభిస్తాను. అలాగే, ఆరోజు సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధం అవుతాను" అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇది చర్చనీయాంశం అవుతోంది.


Click it and Unblock the Notifications











