డియర్ మేఘకు బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రోత్సాహం.. ఫీల్‌గుడ్‌గా ఆమని పక్కన ఉంటే!

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో రిలీజ్‌కు ముందే ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను సొంతం చేసుకొంటున్న చిత్రం డియర్ మేఘ. యువ హీరో, హీరోయిన్లు అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఇలాంటి చిత్రానికి బుట్టబొమ్మ పూజా హెగ్డే తన వంతు సహకారం అందించారు. ఈ సినిమాకు సంబంంధించిన లిరికల్ సాంగ్ వీడియోను ఆవిష్కరించి సినిమా యూనిట్‌ను ప్రొత్సహించారు.

వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మాతగా యువ డైరెక్టర్ సుశాంత్ రెడ్డి డియర్ మేఘ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆమని ఉంటే పక్కన..' అనే లిరికల్ సాంగ్‌ను శుక్రవారం ఉదయం 10.18 నిమిషాలకు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేసి సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Pooja Hegde Unveils Dear Meghas lyrical Song

అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ల మీద చిత్రీకరించిన ఈ అందమైన డ్యూయెట్‌లో సాహిత్యం ఫీల్‌గుడ్‌గా ఉంది.

ఆమని ఉంటే పక్కన...ఏమని చెప్పను భావన...
పోతే మళ్లీ రాదనా...మళ్లీ మళ్లీ చూడనా..
యే వానవిల్లో వేల రంగుల్లో కిందే వాలిందో...
ఏ తీపిముల్లో నాటి గుండెల్లో నవ్వై పూసిందో..
నీ ఊపిరేమో వెచ్చంగ మెల్లో ఇల్లా తాకిందో...
నా ధ్యాస మొత్తం నీ మాయలోకే అల్లా జారిందో..
అడుగు, అడుగు నీతోనే..ఆకాశం అంచుకు వెళుతున్నానే..
మలుపు, మలుపు నీతోనే మనసులో నే నీకో గుడి కడుతున్నాలే అంటూ ఈ పాట సాగుతుంది.

సినీ గేయ రచయిత కృష్ణకాంత్ రాసిన ఈ పాటకు సంగీత దర్శకుడు హరి గౌర సంగీతం అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు.
బ్యూటీఫుల్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న డియర్ మేఘ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్నది.

నటీనటులు: అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ తదితరులు
సంగీతం: హరి గౌర
సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్: కేవీ రమణ
పీఆర్వో: జీఎస్ కే మీడియా
నిర్మాత: అర్జున్ దాస్యన్
రచన, దర్శకత్వం: సుశాంత్ రెడ్డి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X