Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్‌కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రంగ్ దే పాట.. షేర్ చేసిన పూనమ్ కౌర్
అసలే ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ మంచి ఊపులో ఉన్నాడు. పైగా సిధ్ శ్రీరామ్‌తో మొదటిసారిగా పాడించుకుంటున్నాడు. ఇక ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెలోడిలకు ఇద్దరూ ఫేమస్సే. అలాంటి ఈ ఇద్దరి నుంచి అదిరిపోయే గీతం వచ్చింది. నితిన్ రంగ్ దే సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ఇస్తోన్న పాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే రెండు పాటలు బాగానే క్లిక్ అయ్యాయి.
ఇక తాజాగా మూడో పాటను మహేష్ బాబు రిలీజ్ చేశాడు. నా కనులు ఎప్పుడూ అనే ఈ పాటను సిధ్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. సెలెబ్రిటీలు, సంగీత ప్రియులు ఈ పాటను షేర్ చేస్తూ తమ ప్రేమను కురిపిస్తున్నారు. ఈక్రమంలో పూనమ్ కౌర్ ఆ పాటపై తనకున్న ఇష్టాన్ని వ్యక్త పరిచింది. ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే పూనమ్ కౌర్ తాజాగా సినిమా పాటను షేర్ చేసింది.
ఎప్పుడూ కాంట్రవర్సీ ట్వీట్లను వేసే పూనమ్.. ఇలా రంగ్ దే పాటను షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు. పాట బాగానే నచ్చినట్టుంది.. అందుకే ఇలా షేర్ చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చెక్ సినిమాతో మంచి హిట్ కొట్టిన నితిన్.. రంగ్ దే సినిమాతో మ్యూజికల్ హిట్ కొట్టేలా కనిపిస్తోంది. 'రంగ్ దే' చిత్రం మార్చి 26న విడుదల కాబోతోందన్న విషయం అందరికీ తెలిసిందే.