twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగ్ దే పాట.. షేర్ చేసిన పూనమ్ కౌర్

    |

    అసలే ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ మంచి ఊపులో ఉన్నాడు. పైగా సిధ్ శ్రీరామ్‌తో మొదటిసారిగా పాడించుకుంటున్నాడు. ఇక ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెలోడిలకు ఇద్దరూ ఫేమస్సే. అలాంటి ఈ ఇద్దరి నుంచి అదిరిపోయే గీతం వచ్చింది. నితిన్ రంగ్ దే సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ఇస్తోన్న పాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే రెండు పాటలు బాగానే క్లిక్ అయ్యాయి.

    ఇక తాజాగా మూడో పాటను మహేష్ బాబు రిలీజ్ చేశాడు. నా కనులు ఎప్పుడూ అనే ఈ పాటను సిధ్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. సెలెబ్రిటీలు, సంగీత ప్రియులు ఈ పాటను షేర్ చేస్తూ తమ ప్రేమను కురిపిస్తున్నారు. ఈక్రమంలో పూనమ్ కౌర్ ఆ పాటపై తనకున్న ఇష్టాన్ని వ్యక్త పరిచింది. ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే పూనమ్ కౌర్ తాజాగా సినిమా పాటను షేర్ చేసింది.

    Poonam kaur Shares Rang De na kanulu yeppudu song

    ఎప్పుడూ కాంట్రవర్సీ ట్వీట్లను వేసే పూనమ్.. ఇలా రంగ్ దే పాటను షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు. పాట బాగానే నచ్చినట్టుంది.. అందుకే ఇలా షేర్ చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చెక్ సినిమాతో మంచి హిట్ కొట్టిన నితిన్.. రంగ్ దే సినిమాతో మ్యూజికల్ హిట్ కొట్టేలా కనిపిస్తోంది. 'రంగ్ దే' చిత్రం మార్చి 26న విడుదల కాబోతోందన్న విషయం అందరికీ తెలిసిందే.

    English summary
    Poonam kaur Shares Rang De na kanulu yeppudu song,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X