Divorce భార్యకు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ విడాకులు.. ఆ స్టార్ హీరోనే కారణమా?
ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవి ప్రకాష్ కుమార్ తన భార్య, గాయని సైంధవీతో విడిపోతున్నట్టు తాజాగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి ఓ స్టార్ హీరో కారణం అంటూ టాక్ నడుస్తోంది. మరి అసలు ఈ జంట విడాకులు తీసుకోవడానికి రీజన్ ఎవరు అని ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం.
మే 13న జీవీ ప్రకాష్ కుమార్, సైంధవీ తాము విడాకులు తీసుకోబోతున్నాము అనే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చాలామందికి షాక్ ఇచ్చారు. నిజానికి జీవి ప్రకాష్, సైంధవి స్కూల్ డేస్ లోనే లవ్ లో పడ్డారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి బంధం మరింత బలపడి పెళ్లి వైపు అడుగులేసింది. దాదాపు 10 ఏళ్ల డేటింగ్ తర్వాత 2013లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

ఈ 2020 ఏప్రిల్ లో కూతురు కూడా పుట్టింది. ఇక ప్రస్తుతం జీవి ప్రకాష్ కుమార్ ఓవైపు సంగీత దర్శకుడిగా మరోవైపు హీరోగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటు సైంధవి ప్లే బ్యాక్ సింగర్ గా రాణిస్తోంది. ఇలాంటి తరుణంలో ఎంతో అన్యోన్యంగా ఉంటుంది అని భావించే ఈ జంట విడాకుల బాట పట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు మూవీ లవర్స్.
అయితే జీవి ప్రకాష్ కుమార్, సైంధవి విడాకులు తీసుకోవడానికి ఓ స్టార్ హీరో కారణం అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడితో ఉన్న స్నేహం కారణంగానే సైంధవి తన భర్తకు విడాకులు ఇచ్చిందని అంటున్నారు. మొదట్లోనే అతనితో స్నేహం వద్దని సైంధవి వారించడంతో జీవి ప్రకాష్ కుమార్ అతనికి దూరంగా ఉన్నాడని, కానీ రీసెంట్ గా అతనితో జీవితో ఫ్రెండ్షిప్ చిగురించడంతో అదే ఈ సెలబ్రిటీ కపుల్ ఇంట విడాకుల పంచాయతీకి కారణమైందని అంటున్నారు.

సైంధవితో జీవి ప్రకాష్ కుమార్ విడాకులకు ఇండస్ట్రీలోని అతని చెడు సావాసాలు, స్నేహితుల సర్కిలే కారణమని సినిమా రంగంలోని ఎంతోమంది బహిరంగంగానే నిందిస్తున్నారు. ఇక మరోవైపు కొంతమంది హీరోయిన్లతో జీవి ప్రకాష్ కుమార్ సన్నిహితంగా మెలగడం కారణంగానే సైంధవీ అతనికి విడాకులు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ఇదిలా ఉండగా గతంలో జీవి ప్రకాష్ కుమార్ మాట్లాడిన మాటలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. ప్రేమలు, బ్రేకప్ లకు కారణం ఏంటో తెలుసా ? అంటూ జీవి ప్రకాష్ కుమార్ మాట్లాడారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సలహాలు ఇవ్వడానికి మూడో వ్యక్తి రావడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. ముందు ఇద్దరి మధ్య ఇతరుల ప్రమేయాన్ని ఆపగలిగితే ఈ బ్రేకప్ జరగదు అంటూ జీవి ప్రకాష్ కుమార్ చెప్పుకొచ్చారు.మొత్తానికి ఈ సెలబ్రిటీ కపుల్ విడాకుల బాట పట్టడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కానీ అందరి టార్గెట్ జీవి ప్రకాష్ కుమార్ అయ్యాడు. సైంధవి మంచిది, ఇతనే చెడ్డవాడు అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











