కొడుకు బిగ్‌బాస్ రియాలిటీ షోలో.. బయట తండ్రికి కరోనావైరస్ పాజిటివ్
ప్రముఖ సినీ గాయకుడు కుమార్ సాను కరోనావైరస్ బారిన పడ్డారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన కుమార్ సాను ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని అభిమానులు వేడుకొంటూ పోస్ట్ షేర్ చేశారు. దురదృష్ట వశాత్తూ సానుదాకు కరోనావైరస్ పాజిటివ్ అని తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.
కుమార్ సాను పోస్టుపై అభిమానులు స్పందిస్తూ.. త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షించారు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకొంటున్నామని తెలిపారు.

90లో రిలీజైన ఆషీకి చిత్రంతో కుమార్ సానుకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. జయం మనదేరా, నువ్వు నాకు నచ్చావు, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, మళ్లీశ్వరి లాంటి చిత్రాల్లో ఆయన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఇదిలా ఉండగా, కుమారు సాను కుమారుడు జాన్ కుమార్ సాను ప్రస్తుతం బిగ్‌బాస్ 14లో ఉన్నారు. తనదైన శైలిలో జాన్ కుమార్ సాను ఇంటిలో రాణిస్తున్నారు. ఈ సమయంలో కుమార్ సాను కరోనాబారిన పడటంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











