twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ గాయకురాలికి ప్రమాదం.. నేను క్షేమంగా ఉన్నాను.. ఆందోళన వద్దు..

    |

    ప్రఖ్యాత సినీ గాయకురాలు ఎస్ జానకి ప్రమాదానికి గురయ్యారు. మైసూరులో గాయపడటంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. గాయానికి సర్జరీ అవసరం కావడంతో వెంటనే ఆపరేషన్ చేసి చికిత్సను అందించారు. ప్రస్తుతం జానకి గాయం బాధ నుంచి కోలుకొంటున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జానకి దక్షిణాది నైటింగేల్‌ అనే పేరును సొంతం చేసుకొన్నారు. గాయపడిన ఆమెను పలువురు ఫోన్‌లో పరామర్శించారు. వివరాల్లోకి వెళితే..

    జారిపడిన గాయని జానకి

    జారిపడిన గాయని జానకి

    గాయని జానకి తన బంధువులను కలువడానికి మైసూరుకు వెళ్లారు. అక్కడ కాలు జారి పడటంతో ఆమె తుంటి ఎముక విరిగింది. దాంతో జానకిని మైసూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా.. ప్రముఖ వైద్యుడు నితిన్ ఆమెకు సర్జరీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గాయం గురించి వివరించారు. వృద్ధాప్యంలో అలాంటి ప్రమాదాలు జరగడం సర్వసాధారణం అని చెప్పారు.

    తుంటికి గాయంతో సర్జరీ

    తుంటికి గాయంతో సర్జరీ

    సర్జరీ అనంతరం జానకిని శనివారం (మే 4న) హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. సర్జరీ సక్సెస్ అయిందని, ఆమె కులాసాగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. హస్పిటల్ నుంచి వెళ్తూ మీడియాను ఆమె హుషారుగా పలకరించారు. తనకు ఎలాంటి సమస్య రాకుండా సకాలంలో వైద్యులు స్పందించారు. జాగ్రత్తగా సర్జరీ చేసిన ఉపశమనం కలిగించిన వైద్యులకు, నర్సులకు ఆమె థ్యాంక్స్ చెప్పారు.

    అభిమానుల ప్రార్థనలతో క్షేమంగా

    అభిమానుల ప్రార్థనలతో క్షేమంగా

    నా బంధువుల ఇంటిలో ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడ్డాను. తుంటి ఎముక విరగంతో ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. కొన్ని రోజులు మైసూరులోనే ఉంటాను. కన్నడ ప్రజలకు నేనే ఎంతో ప్రేమ. వారి ప్రార్థనలు, ప్రేమ వల్లే నాకు ఏమీ కాలేదు. నేను క్షేమంగా ఉన్నాను. నా ఫ్యాన్స్ అంటే నాకు బిడ్డలతో సమానం. నా క్షేమం కోసం వారు ప్రార్థించడం నాకు గొప్ప ఉపశమనం అని జానకి అన్నారు.

    ఆరు దశాబ్దాలుగా ఆంధ్రా నైటింగేల్‌గా

    ఆరు దశాబ్దాలుగా ఆంధ్రా నైటింగేల్‌గా

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జానకి దక్షిణాదిలోని అన్ని భాషల్లో పాటలు పాడారు. 1956లో ఆమె సినీ రంగం ప్రవేశం చేశారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా సినీ రంగంలో గాయనిగా రాణిస్తున్నారు. ఆమెను ప్రేమగా దక్షిణాది నైటింగేల్ అని పిలచుకొంటారు. దేశవ్యాప్తంగా ఆమె పలు సంగీత కచేరీలు నిర్వహించారు. చివరిసారిగా 2017లో మైసూరులో సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు.

    English summary
    Popular Singer S Janaki, who is hailed as the nightingale of South Indian cinema, suffered a nasty fall when she had gone to visit her relatives at their house in Mysuru. It is reported that the 81-year-old singer had fractured her hip and had to undergo surgery.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X