నీటి లోపల హీరోయిన్‌తో ప్రభాస్ రొమాన్స్.. ఏ సినిమాలో చూపించని విధంగా!

తెలుగు చిత్ర పరిశ్రమలో కనీవినీ ఎరుగని రీతిలో వరుసగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తూ.. దేశ వ్యాప్తంగా తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలతో సత్తా చాటిన అతడు.. గత ఏడాది వచ్చిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో చాలా కాలం తర్వాత హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి మరింత జోష్‌తో వెళ్తున్నాడు.

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత వరుస చిత్రాలతో దూసుకెళ్తోన్న ప్రభాస్.. ఇప్పుడు చేతిలో నాలుదైదు సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అందులో 'కల్కి 2898 ఏడీ' ఒకటి. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో బిగ్ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా టైం ట్రావెల్‌ కాన్సెప్టుతో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Prabhas and Disha Patani Under Water Song Highlight in Kalki 2898 AD Movie

'కల్కి 2898 ఏడీ' సినిమాను పాన్ వరల్డ్‌ రేంజ్‌తో తీస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా చిత్రీకరించి ఇప్పటికే దాదాపుగా 90 శాతం వరకూ టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు.

హై రేంజ్ కాన్సెప్టుతో రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల అంశాలు బయటకు వచ్చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలోనే హైలైట్ కాబోతున్న ఓ సాంగ్ గురించి సమాచారం లీకైంది. అంతేకాదు, ఈ పాట నీటి లోపల సాగుతుందని, గతంలో ఏ తెలుగు సినిమాలో చూపించని విజువల్స్‌తో దీన్ని డిజైన్ చేశారని ఫిలిం నగర్‌ టాక్.

Prabhas and Disha Patani Under Water Song Highlight in Kalki 2898 AD Movie

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'కల్కి 2898 ఏడీ' మూవీలో వచ్చే అండర్ వాటర్ సాంగ్‌లో ప్రభాస్‌తో పాటు దిశా పటానీ కనిపించబోతుందట. వీళ్లిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ డ్యాన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుందని సమాచారం. ఇక, ఈ సాంగ్ గురించి సమాచారం బయటకు రావడంతో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు అన్నీ రెట్టింపు అయిపోతున్నాయి.

ఇదిలా ఉండగా.. 'కల్కి 2898 ఏడీ' మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది మే 9వ తేదీన విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X