ప్రభాస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్.. వరే వరే వరే వచ్చేశాడు రాజా సాబ్
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగింది. దీనికి కొంత మంది హీరోలే కారణం అని చెప్పాలి. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో సత్తా చాటుతోన్న అతడు.. ఇప్పుడు కూడా చేతి నిండా ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'సలార్: సీజ్‌ఫైర్'తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు.
రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' సినిమాను చేశాడు. ఇది జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ బడా హీరో ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రభాస్ ఇలా తన పనులను తాను చేసుకోవడంతో పాటు ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు. ఇలా అతడు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీ చేస్తున్నాడు.

రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో హర్రర్ కామెడీతో రూపొందుతోన్న 'ది రాజా సాబ్' సినిమాను సీక్రెట్‌గానే మొదలు పెట్టి చాలా షెడ్యూళ్లను జరిపారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 40 శాతం వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్లు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా రిలీజ్ గురించి చాలా రోజులు నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని 2024లోనే విడుదల చేస్తారని, కాదు కాదు 2025లో తీసుకు వస్తారని టాక్స్ వినిపించాయి. దీంతో ప్రభాస్ అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'ది రాజా సాబ్' మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ తాజాగా ప్రారంభం అయ్యాయి. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు మారుతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాదు, 'వరే వరే వరే వచ్చేశాడు రాజా సాబ్' అనే థీమ్ సౌండ్ క్లిప్‌ను కూడా షేర్ చేశాడు. ఈ ఊహించని సర్‌ప్రైజ్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. హర్రర్ థ్రిల్లర్ స్టోరీతో రాబోతున్న 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.


Click it and Unblock the Notifications











