ప్రభాస్‌కు మెంటలెక్కించిన పవన్ కల్యాణ్ పాట.. ఆ పవర్ స్టార్ సాంగ్ ఏమిటో తెలుసా?

జెనరల్ సినిమా ఆడియెన్స్ లో ఆయా హీరోలకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోలు వారి తోటి హీరోలతో కనిపించే సందర్భాలు కానీ వారిలో ఒకరిపై ఒకరు చేసుకునే కామెంట్స్ మంచి ఎగ్జైట్మెంట్ ని అభిమానుల్లో తీసుకొస్తాయి. అలా అయాన్ స్క్రీన్ పై కాకుండా ఆఫ్ లైన్ లో కూడా చాలా మంది స్టార్ హీరోలు ఇతర హీరోలతో మంచి బాండింగ్ ని మెయింటన్ చేస్తారు.

కాగా తెలుగు సినిమా సహా ఇండియన్ సినిమా దగ్గర మంచి ఫాలోయింగ్ ఉన్న బిగ్ స్టార్స్ వంటి వారు ఒకరి కోసమో లేక ఒకరి సినిమాలో ఎలిమెంట్స్ కోసం మాట్లాడుకోవడం అనేది ఇపుడు ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. మరి ఆ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా బిగ్ స్టార్ ప్రభాస్ లాంటి వారు అయితే ఆ హైప్ నే వేరే లెవెల్లో ఉంటుంది.

prabhas excited heavily for pawan kalyan this song in jalsa movie

కాగా ఆ మధ్య పవన్ పై ప్రభాస్ కానీ ప్రభాస్ పై పవన్ కళ్యాణ్ గాని చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఐతే ఆ మధ్య పవన్ చేసిన కామెంట్స్ ఏమో కానీ ప్రభాస్ ఇటీవల పాల్గొన్న ఓ టాక్ షోలో చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ప్రభాస్ కి పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ఓ సాంగ్ అంటే పిచ్చి ఇష్టం అట.

ఆ సాంగ్ అంటే ఎంత ఇష్టం అంటే తన స్నేహితులకి ఆ సాంగ్ కోసం పదే పదే చెప్పి వారికి విసుగు కూడా తెప్పించేసేలా ఇష్టమట. ఆ సాంగ్ కోసం ప్రభాస్ ప్రస్తావన తెస్తే మళ్ళీ చెప్తున్నాడు అంటూ తన స్నేహితులు తన దగ్గర నుంచి పారిపోయేవారట. మరి ప్రభాస్ ని అంతలా ఊపేసిన పవన్ సాంగ్ ఏదో కూడా కాదట.. కాగా పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్లో మ్యూజిక్ ఆల్బమ్స్ కి ఒక సెపరేట్ క్రేజ్ ఉంది.

prabhas excited heavily for pawan kalyan this song in jalsa movie

అలా భారీ హిట్ అయ్యిన మ్యూజిక్ ఆల్బమ్స్ లో అప్పట్లో టాలీవుడ్ యువతని ఒక ఊపు ఊపేసిన సినిమా "జల్సా" కూడా ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం పదునుకి పవన్ తోడై మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా తాను ఇచ్చిన పాటల్లో పవన్ పాత్రపై సాగే పవర్ఫుల్ సాంగ్ ఛలోరె చల్ సాంగ్ అంటే తెలియని ఫ్యాన్స్ ఉండరు. మరి సరిగ్గా ప్రభాస్ కి కూడా ఈ సాంగ్ అంటేనే ఎంతో ఇష్టం అట.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ సాంగ్ అంటే ఒక తెలియని ఎనర్జీ వచ్చేసేది అని అప్పట్లో చాలా ఎక్కువగా ఆ సాంగ్ వినేవాడిని అంటూ పాన్ ఇండియా హీరో పవన్ సాంగ్ పట్ల చాలా ఎగ్జైట్ అవుతూ కామెంట్స్ చేసాడు. దీంతో ఇది చూసిన పవర్ అండ్ రెబల్ అభిమానులు ఓ రేంజ్ లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రభాస్ కి పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఈ సాంగ్ మోస్ట్ ఫెవరెట్ అని తెలిసేసరికి పవన్ అభిమానులు కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనితో ఇలా ఈ ఇద్దరిపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మొదలైంది.

More from Filmibeat

Read more about: prabhas pawan kalyan jalsa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X