Ee Raathale Video Song: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఒక్క పాటతో స్టోరీ రివీల్

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలో చిన్న బడ్జెట్ చిత్రాలకే పరిమితం అయిన అతడు.. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి'తో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఈ మూవీతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో విస్తరించింది. ఆ తర్వాత వచ్చిన 'సాహో' కూడా ఉత్తరాదిలో మంచి ప్రభావాన్నే చూపించడంతో పాటు ప్రభాస్ క్రేజ్‌ను రెట్టింపు చేసింది. అందుకే అప్పటి నుంచి పాన్ ఇండియా రేంజ్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రాధే శ్యామ్' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను చేశాడు.

గోపీచంద్ హీరోగా నటించిన 'జిల్' మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగానే పూర్తి అవుతోంది. మధ్యలో కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు ఆటంకాలు ఏర్పడడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అవి కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయని తెలుస్తోంది.

Prabhass Radhe Shyam Ee Raathale Video Song Released

పాన్ ఇండియాపై ప్రభావాన్ని చూపిస్తోన్న స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాధే శ్యామ్'ను సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించి.. ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరువ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు టీజర్, ట్రైలర్, పాటలను కూడా విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలకు అంతా రెడీ అనుకున్న సమయంలోనే కరోనా ప్రభావం కారణంగా ఇది వాయిదా పడింది. దీంతో ఇప్పుడు మళ్లీ కొన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'రాధే శ్యామ్' మూవీ నుంచి తాజాగా ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. జస్టిన్ ప్రభాకరణ్ కంపోజ్ చేసిన ఈ పాటను యువన్ శంకర్ రాజా, హరిణి ఆలపించారు. దీనికి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. ఇక, పూర్తిగా విదేశీ బ్యాగ్‌డ్రాప్‌లో సాగే ఈ పాటలో హీరో, హీరోయిన్లు ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడిపోతారు. మొదట హీరోయిన్ గొడపై బొమ్మను గీయడం.. ఆ తర్వాత దాన్ని హీరో మరింత అందంగా తీర్చిదిద్దడం లాంటివి ఇందులో చూపించారు. విజువల్ ట్రీట్‌గా ఉన్న ఈ మెలోడీ సాంగ్‌కు శ్రోతల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇది తక్కువ టైంలోనే వైరల్ అయింది.

'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X