Nagumomu Thaarale Song: రొమాన్స్‌తో రచ్చ చేసిన ప్రభాస్.. ప్రాణం పోసిన సిద్ శ్రీరామ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు టాలీవుడ్ హీరో ప్రభాస్. ఈ చిత్రంతో తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసుకున్న అతడు.. ఆ వెంటనే 'సాహె'తో ఉత్తరాది ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. అప్పటి నుంచి తన పంథాను మార్చుకుని అన్ని చిత్రాలనూ పాన్ ఇండియా రేంజ్‌లోనే చేస్తున్నాడు. ఇలా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. జిల్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న రాధాకృష్ణ కుమార్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

'రాధే శ్యామ్' షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగా అవుతోంది. మధ్యలో కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు ఆటంకాలు ఏర్పడడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అవి కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం షురూ చేసేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్లిమ్స్ వీడియోతో పాటు ఓ పాటను కూడా విడుదల చేసింది.

 Prabhass Radhe Shyam Nagumomu Thaarale Video Song Released

క్రేజీ కాంబినేషన్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీ నుంచి ఇటీవలే 'ఈ రాతలే' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అదే సమయంలో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రం నుంచి 'నగుమోము తారలే' అంటూ సాగే ఓ రొమాంటిక్ ఫీల్‌ గుడ్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. హీరో, హీరోయిన్ల మధ్య సాగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను ఈ పాట రూపొందినట్లు ఇందులో చూపించారు.

జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన ఈ పాటను కృష్ణ కాంత్ రచించారు. ఇక, ఈ సాంగ్‌ను యంగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగే ఈ పాట అద్భుతమైన పిక్చరైజేషన్‌తో రూపొందింది. మరీ ముఖ్యంగా ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే కనిపించిన తీరు చక్కగా ఉంది. ఈ పాటకు సిద్ తన గాత్రంతో ప్రాణం పోస్తే.. ప్రభాస్ రొమాన్స్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. దీంతో ఈ ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే 'నగుమోము తారలే' సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు కీలక పాత్రలను చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X