Sanchari Song: రాధే శ్యామ్ నుంచి మరో సర్‌ప్రైజ్.. సింగర్‌గా మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్
తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసేసిన 'బాహుబలి' మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు టాలీవుడ్ బడా హీరో ప్రభాస్. ఈ చిత్రంతో తన స్టామినాను కూడా ప్రపంచానికి పరిచయం చేసుకున్న అతడు.. ఆ వెంటనే 'సాహె'తో ఉత్తరాది ప్రేక్షకుల దృష్టిలో పడిపోయాడు. అప్పటి నుంచి తన పంథాను మార్చుకుని అన్ని చిత్రాలనూ పాన్ ఇండియా రేంజ్‌లోనే చేస్తున్నాడు. ఇలా ప్రస్తుతం ప్రభాస్ 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. జిల్ మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్న రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
'రాధే శ్యామ్' మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లకు పైగానే అవుతోంది. మధ్యలో కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు ఆటంకాలు ఏర్పడడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. అవి కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్లిమ్స్ వీడియోతో పాటు రెండు పాటలను కూడా రిలీజ్ చేసేసింది.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'రాధే శ్యామ్' మూవీ నుంచి ఇటీవలే 'ఈ రాతలే', 'నగుమోము తారలే' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీ సాంగ్‌లను విడుదల చేశారు. వీటికి శ్రోతల భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అదే సమయంలో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని వదులుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రం నుంచి 'సంచారి' అంటూ సాగే ఓ ఫీల్ గుడ్ సాంగ్‌ను విడుదల చేశారు. హీరో పాత్రను, అతడి వ్యవహార శైలిని వర్ణిస్తూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా ఇందులో ప్రభాస్ లుక్స్ సూపర్బ్‌గా ఉన్నాయి.
సౌతిండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన 'సంచారి' పాటను కృష్ణ కాంత్ రచించారు. ఇక, ఈ సాంగ్‌ను యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించాడు. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగే ఈ పాట అద్భుతమైన పిక్చరైజేషన్‌తో రూపొందింది. మరీ ముఖ్యంగా ఇందులో విజువల్స్ ఎంతో రిచ్‌గా ఉన్నాయి. ఇక, ఈ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే 'సంచారి' సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్నాడు. అలాగే, ఇది టైమ్ ట్రావెల్ కథ అని, పునర్జన్మల నేపథ్యంతో సాగే సినిమా అని అంటున్నారు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ వంటి వాళ్లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











