Adipurush జై శ్రీరాం అంటూ జై కొడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం రోజు రోజుకు అంచనాలు పెంచుతున్నది. ఈ సినిమా మోషన్ పోస్టర్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానుల్లో ఉత్తేజాన్ని ఉరకలు వేసే విధంగా చేశాయి. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ తర్వాత థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ చిత్రం ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ థియేటర్లలో వస్తున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రకరకాల ప్లానింగ్ జరుగుతున్నది. ఆదిపురుష్ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు జై శ్రీరామ్ పాటను ఫుల్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు. అయితే జై శ్రీరామ్ పాట రిలీజ్ డేట్ వివారాల్లోకి వెళితే..
ప్రభాస్, సైఫ్ ఆలీ ఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్, ఇంకా ఎందరో నటులు కీలక పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు క్రేజ్ పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ట్రైలర్ మంచి వైబ్ క్రియేట్ చేసింది. ట్రైలర్ తర్వాత మరోసారి మంచి క్రేజ్ క్రియేట్ చేయడానికి జై శ్రీరామ్ పాట గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి క్రేజ్ లభించడం.. థియేటర్లలో అభిమానులు డ్యాన్సులు చేయడంతో ఫుల్ పాటను అందించేందుకు ముందుకొస్తున్నారు.

జై శ్రీరామ్ అనే పాటకు అజయ్, అతుల్ మంచి ట్యూన్ అందించగా.. ఆ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అద్బుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను సంగీత ప్రియులకు, రామభక్తులకు ఓ కీర్తనగా మారేలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నది. ఈ పాటను మే 20 తేదీన రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేసింది.
అయితే ముంబైలో జై శ్రీరాం పాటను ఆవిష్కరణ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఈ వేడులకలో అజయ్ అతుల్ సంయుక్తంగా దాదాపు 30 మంది కోరస్ గాయకులతో ఈ పాటను లైవ్‌గా రిలీజ్ చేయనున్నారు. జై శ్రీరాం సాంగ్ ఆదిపురుష్ సినిమాకు సోల్‌లా ఉంటుంది. భావితరాలకు కూడా ఈ సినిమా గొప్ప అనుభూతిని, భారతీయ చరిత్రను తెలియజేసేలా ఉంటుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ప్రముఖ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమాను టీ సీరీస్ నిర్మిస్తున్నది. ఈ సినిమాను భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఓం రావత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్, ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 16 తేదీ జూన్, 2023లో రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











