సాహూ ఫస్ట్ సాంగ్ అదిరింది.. హోరెత్తించిన ప్రభాస్, శ్రద్ద కపూర్

'బాహుబలి' సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్‌లో రాబోతున్న మరో భారీ ప్రాజెక్టు 'సాహూ'. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కేవలం ఒక్క పాట మినహా షూటింగ్ అంతా ఫినిష్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. షూటింగ్ జరుపుతూనే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సాహూ టీం తాజాగా చిత్రంలోని మొదటిపాటను విడుదల చేసింది.

సైకో సయాన్ అంటూ సాగిపోతున్న ఈ పాటలో ప్రభాస్, శ్రద్ద కపూర్ పోటీపడి డాన్స్ చేశారు. ఈ సాంగ్ లో ప్రభాస్, శ్రద్ద కపూర్ ఇద్దరూ అట్రాక్టివ్ లుక్‌లో దర్శనమిచ్చి హోరెత్తించారు. సాచెట్ టాండన్, ధ్వని భానుశాలి, తనిష్క్ బాగ్చి ఈ పాటను ఆలపించారు. పాడటమే గాక సంగీతం అందించింది కూడా తనిష్క్ బాగ్చినే కావడం విశేషం.

Prabhas Saaho First song Psycho Saiyaan Released

ఈ సాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ యాక్షన్ సన్నివేశాల మధ్య ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇస్తుందని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, షేడ్స్ ఆఫ్ సాహూ ఎపిసోడ్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ఈ సాంగ్ అన్నివర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 400 కోట్ల భారీ బడ్జెట్‌తో సాహూ సినిమా తెరకెక్కుతోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X