సాహూ సందడి షురూ కానుంది.. త్వరలోనే 'కాదల్ సైకో'
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్‌లో రాబోతున్న మరో భారీ ప్రాజెక్టు 'సాహూ'. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికీ టాకీ పార్ట్ అంతా ఫినిష్ చేసుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ అంతా ఫినిష్ అయిందని సమాచారం.
సాహూ చిత్రాన్ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో షూటింగ్ జరుపుతూనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని చిత్ర యూనిట్ భావింస్తోందట. ఈ మేరకు చిత్రానికి సంబందించిన లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా మొదటి పాట 'కాదల్ సైకో' అతి త్వరలో విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రభాస్, శ్రద్ధ కపూర్ ల పోస్టర్లను విడుదల చేసింది. ఈ పోస్టర్స్ లో ప్రభాస్, శ్రద్ద కపూర్ ఇద్దరూ అట్రాక్టివ్ లుక్ లో దర్శనమిచ్చారు.

సాహూ ద్వారానే తెలుగు తెరపై అడుగుపెడుతున్న బాలీవుడ్ భామ శ్రద్ద లుక్స్ యూత్ ఆడియన్స్‌ని ఫిదా చేస్తున్నాయి. సాహూ చిత్రంలో ప్రభాస్‌తో రొమాన్స్ చేయడమే గాక గన్ను పట్టి యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేయనుంది శ్రద్ద కపూర్. ప్రస్తుతం సాహూ కి సంబందించిన సాంగ్ చిత్రీకరణ ఆస్ట్రియా లోని అందమైన లొకేషన్స్ లో జరుగుతోంది. ఈ సాంగ్ పూర్తికాగానే ప్రభాస్ తో ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట. ఈ సాంగ్‌లో ప్రభాస్ సరసన కియారా అద్వానీ చిందులేయనుందని తెలుస్తోంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో సాహూ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకుంటోంది. విడుదలకు ముందే భారీ బజ్ ఏర్పడటంతో సాహూ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.


Click it and Unblock the Notifications











