twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మ్యూజిక్ కష్టాల నుంచి బయటపడ్డ సాహూ టీమ్..

    |

    బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్ లో రాబోతున్న మరో ప్రతిష్టాత్మక సినిమా 'సాహూ'. పూర్తి స్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. యాక్షన్ సినిమా కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్‌కి మంచి ప్రాధాన్యత ఉండి తీరాల్సిందే. ఈ నేపథ్యంలోనే చిత్రాన్ని బాణీలు మరో మెట్టు ఎక్కించాలని జాగ్రత్త పడ్డారు.

    ఈ మేరకు సాహూ సంగీత దర్శకులుగా శంకర్ ఎహసాన్ లాయ్ ను తీసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి సాహూ సంగీత దర్శుకుడి పైనే అందరి దృష్టి పడింది. భారీ బడ్జెట్, భారీ అంచనాల నడుమ వస్తున్న సినిమా కావడంతో ఏ ఒక్క లోపం ఉన్నా అది ఇబ్బందికరమే అని భావించిన చిత్రయూనిట్ సంగీత దర్శకులుగా.. తమన్, జిబ్రాన్ పేర్లను పరిశీలించింది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు కన్ఫర్మ్ అని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

    Prabhas Sahoo movie Music Director Selected..?

    అయితే తాజా సమాచారం మేరకు జిబ్రాన్ వైపే సాహూ టీమ్ మొగ్గిందని తెలుస్తోంది. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన సినిమాలకి జిబ్రాన్ పని చేశారు కాబట్టి ఆయన్నే తీసుకుందామని సాహూ టీమ్ డిసైడ్ అయ్యారట. అదేవిధంగా ఈ సినిమా లోని పాటల కోసం ముగ్గురు బాలీవుడ్ సంగీత దర్శకుల భాగస్వామ్యం కూడా ఉండనుందని తెలుస్తోంది. అంటే.. సాహూ యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు మ్యూజిక్ ఎంటర్‌టైనర్ కూడా కానుందన్నమాట.

    యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమా ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఆగస్టు 15వ తేదీన భారీ ఎత్తున అత్యధిక థియేటర్స్‌లో సాహూ విడుదల కానుంది.

    English summary
    Young rebal star Prabhas new movie Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully going on. As per latest news sahoo selected Ghibran to give music to sahoo movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X