Adipurush నుంచి పండుగ కానుక: ఒకేసారి రెండు సర్‌ప్రైజ్‌లు
బడా సినీ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైనా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోవడంతో పాటు తన స్టామినాను దేశం మొత్తం చాటుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత నుంచి వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్న అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులను చేస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఇక, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న దీనిపై అంచనాలున్నాయి.
బాలీవుడ్‌లో చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. ఈ మూవీ ద్వారా మన స్టార్ హీరో బాలీవుడ్‌లోకి నేరుగా అడుగు పెడుతున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని స్టోరీ లైన్‌తో.. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందుతోన్నట్లు చిత్ర యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగిసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ నుంచి ఇప్పటి వరకూ కొన్ని అప్‌డేట్లు మాత్రమే వెలువడ్డాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి మొదటి సాంగ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని మొదటి సాంగ్‌ను శ్రీరామనవమి కానుకగా మార్చి 30వ విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఇందులోనే రిలీజ్ డేట్‌పైన కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారని తెలిసింది. అంటే ఒకేసారి ప్రభాస్ ఫ్యాన్స్‌కు రెండు ట్రీట్లు రాబోతున్నాయన్న మాట.
టెక్నికల్ వండర్‌గా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











