Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. పవర్‌ఫుల్ ట్రీట్‌ రాబోతుంది డార్లింగ్స్

పేరుకు తెలుగు హీరోనే అయినా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను ఏర్పరచుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా అతడు దాదాపు ఐదారేళ్లుగా పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ నేషనల్ వైడ్‌గా ఎఫెక్ట్‌ను చూపిస్తున్నాడు. దీనికితోడు ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను ఫుల్ ఖుషీ చేసేస్తున్నాడు.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు మూడు నాలుగు ప్రాజెక్టులను చేస్తున్న విషయం తెలిసిందే. అందులో కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్' ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీని సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రచార చిత్రాలను క్రమంగా వదలాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఆగస్టులోనే 'సలార్' ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే తెలిపింది.

Prabhas Starrer Salaar Movie Intro Song Release on August First Week

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఈ సినిమాలోని పాటలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ సినిమాలోని మొదటి పాటను ఆగస్టు ఫస్ట్ వీక్‌లోనే అంటే మరో రెండు మూడు రోజుల్లోనే విడుదల చేయబోతుందట.

ఫిలిం నగర్ ఏరియాలోని తాజా సమాచారం ప్రకారం.. 'సలార్' చిత్రం నుంచి ముందుగా వదిలే పాట ప్రభాస్ ఇంట్రోకు సంబంధించింది అని అంటున్నారు. ఇది ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని కూడా తెలిసింది. రవి బస్రూర్ ఈ పాటను ఓ రేంజ్‌లో కంపోజ్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రభాస్ ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది.

Prabhas Starrer Salaar Movie Intro Song Release on August First Week

ఇక.. 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X