Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ కిక్.. ఆ స్పెషల్ డేనే సాంగ్ రిలీజ్
హీరోగా పరిచయం అయిన తర్వాత తెలుగు సినిమాల్లోనే కనిపించినా.. 'బాహుబలి' మూవీల తర్వాత పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి ఏకధాటిగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తోన్న అతడు.. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించాడు. వాటి ఫలితాలు ఎలా ఉన్నా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ మూడు నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. వాటిని డేట్స్‌ను బట్టి చేసుకుంటూ వస్తున్నాడు. అందులో కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్' ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సలార్' మూవీని సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రచార చిత్రాలను క్రమంగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఆగస్టులోనే 'సలార్' ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతున్న 'సలార్' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఈ సినిమాలోని పాటలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ సినిమాలోని మొదటి పాటను స్వతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రెండు మూడు రోజుల్లోనే వెలువడనుందనే టాక్ వినిపిస్తోంది. అంటే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒకేసారి రెండు పండుగలు రాబోతున్నాయని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











