Prabhu Deva మై డియర్ భూతం.. అబ్బాక డర్ అంటూ మరో మ్యూజికల్ హిట్!

ఇండియన్ మైఖేల్ జాన్సన్.. ప్రముఖ కోరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా నటించిన మై డియర్ భూతం విడుదలకు ముందు అంచనాలు పెంచింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ యూత్, ఫ్యామిలీ వర్గాలను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్లు విడుదల చేశారు.

ఫస్ట్ సింగిల్‌లో మాస్టర్ అంటూ ప్రభుదేవా తన స్టెప్పులతో మ్యాజిక్ చేశారు. ఇక అబ్బాక డర్ అనే పాట వినోదాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ పాటలో ప్రభుదేవా, అశ్వంత్ చేసిన అల్లరి కడుపుబ్బ నవ్వించేలా ఉంది. డి ఇమ్మాన్ సంగీతాన్ని అందించగా.. ఆదిత్య సురేష్, సహన ఆలపించారు. డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మీ సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ చిత్రానికి తెలుగులో నందు తుర్లపాటి డైలాగ్స్ అందించారు.

 Prabhu Devas My Dear Bhootam second single Abbaka Dar song unveiled

అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. అశ్వంత్ తల్లిగా రమ్యా నంబీశన్ కనిపించనున్నారు. పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత వంటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా నటించారు. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, అలియా, సురేష్ మీనన్, లొల్లు సభా స్వామినాథన్ ముఖ్య పాత్రలను పోషించారు.

యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఇప్పటికే చూసిన జీ నెట్‌వర్క్ టీమ్.. ఫ్యాన్సీ రేటుకు మై డియర్ భూతం ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్నారు. ఇలాంటి వార్తలు, విశేషాల మధ్య
మై డియర్ భూతం ఈ జూలై 15వ తేదీన విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది.

నటీనటులు: ప్రభుదేవా, రమ్యా నంబీశన్, అశ్వంత్, పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత, సంయుక్త,ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ తదితరులు.
డైరెక్టర్: ఎన్ రాఘవన్
ప్రొడ్యూసర్: రమేష్ పి పిళ్ళై
బ్యానర్: అభిషేక్ ఫిలిమ్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్
మ్యూజిక్: డీ ఇమ్మాన్
పాటల రచయిత: డా. చల్లా భాగ్యలక్ష్మీ
మాటల రచయిత: నందు తుర్లపాటి
సినిమాటోగ్రఫీ: యూకే సెంథిల్ కుమార్
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X