పాట వినకుండానే జడ్జిమెంట్ ఇస్తారా? రోడ్డుపైకి వచ్చానా? సింగర్ సునీతకు ప్రవస్తి ఘాటైన కౌంటర్

పాపులర్ రియాలిటీ షో పాడుతా తీయగా షోలో యువ గాయని ప్రవస్తీ ఆరాధ్య ఎలిమినేట్ అయిన విషయం వివాదాస్పదంగా మారింది. తనను అన్యాయంగా షో నుంచి ఎలిమినేట్ చేశారని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీతపై ప్రవస్తీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి బదులు ఇస్తూ సింగర్ సునీత వీడియో రిలీజ్ చేశారు. అయితే తనకు జరిగిన అన్యాయం విషయం లేవనెత్తిన విషయాలు సూటిగా సమాధానం చెప్పలేదు. వాటికి మీరు జవాబు చెబుతారని ఆశిస్తున్నాను అంటూ తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ప్రవస్తీ మాట్లాడుతూ..

చిన్నప్పడు ఒడిలో కూర్చొపెట్టుకొన్నాను. 19 ఏళ్ల వయసులో నేను ఒడిలో కూర్చోబెట్టుకోలేనని అన్నారు. నన్ను మీ ఒడిలో కూర్చొబెట్టుకోమని అనలేదు. అలాంటి ప్రేమ, ప్రోత్సాహం కోరుకొన్నాను. మీరు అలా మాట్లాడటం సరికాదు. అలాగే పాటల ఎంపిక విషయంలో మీరు చెప్పినట్టు.. రైట్స్ ఉన్న మ్యూజిక్ కంపెనీల నుంచే మీరు నాకు సాంగ్స్ ఇచ్చారు. అలాంటి పాటలను నా విషయంలో ఎందుకు తీసేశారో సమాధానం చెప్పు అంటూ ప్రవస్తీ ఆరాధ్య ఘాటైన సమాధానం సంధించింది.

Pravasthi Aradhya

దర్శకులు రాఘవేంద్రరావు పాల్గొన్న డివోషనల్ రౌండ్‌లో నేను డివోషనల్ సాంగ్స్ పాడుతానంటే.. అడ్డుకొన్నారు. అది డివోషనల్ రౌండ్ కాదని చెప్పారు. మరో అమ్మాయి భక్తి పాటలు పాడితే అడ్డుకోలేదు. పైగా ఆమెను ఎంకరేజ్ చేశారు. ఈ విషయం మీరు చెప్పే జవాబు ఏమిటి? నా విషయం మీరు ఎందుకు అలా చేశారు? ఆపకపోగా సైగలు ఎందుకు చేశారు అంటూ ప్రవస్తీ ప్రశ్నించారు.

సాధారణంగా కంటెస్టెంట్లు పాటలు పాడిన తర్వాత ఆ సాంగ్‌ను పాడిన విధానాన్ని బట్టి బాగా పాడారా? లేదా? అని జడ్జిమెంట్ ఇస్తారు. ఓ సందర్భంలో మీకు వ్యక్తిగతంగా ఏదో పని ఉందని చెప్పి.. కంటెస్టెంట్ పాట పాడకుండానే, మీరు వినకుండానే.. మీరు జడ్జిమెంట్ ముందే రికార్డు చేసి వెళ్లారు. ఇది ఎలాంటి జడ్జిమెంట్ అవుతుంది? ఈ విషయంలో మీరు చెప్పే జవాబు ఏంటి? అని ప్రవస్తీ మరో ప్రశ్నను సంధించింది.

కంటెస్టెంట్స్ కొందరు పాటలు పాడే సమయంలో లిరిక్స్ మరిచిపోయారు. మరికొందరు చేతిపై పాటను రాసుకొని వచ్చారు. అలాంటి వారిని అడ్డుకోకుండా వారిని ప్రోత్సాహించారు. నన్ను మాత్రం పాయింట్ చేసి.. వివక్ష చూపించారు. మీరు అలా లిరిక్స్ మరిచిపోయిన వారికి, చేతిపై పాటలు రాసుకొని వచ్చిన వారిని అప్రిషియేట్ చేస్తే మాకు బాధ కలగదా? అని ప్రవస్తి ఆరాధ్య ప్రశ్నించారు.

పాడుతా తీయగా ప్రొగ్రాం నుంచి నన్ను ఎలిమినేట్ చేయడం నాకు బాధ కలిగించింది. ఆ విషయాన్ని మీడియాతో పంచుకొంటే.. రోడ్డుపైకి వచ్చి గొడవ చేశానని అన్నారు. నేను రోడ్డుపైనకు వచ్చి నేను ధర్నాలు చేయలేదు. నా ఇంటి నుంచి జూమ్ కాల్‌లో మీడియాతో మాట్లాడాను. అది కాకుండా ఛానెల్ ఆఫీస్‌కు వెళ్లి నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొన్నాను. నన్ను అలా కించపరచడం బాగాలేదు. అది మీకు సరికాదు అని ప్రవస్తీ అన్నారు.

ఇప్పటికీ మీరంటే గౌరవం.. నాకు వ్యక్తిగతంగా నాకు ద్వేషం లేదు. మీరు లెజెండరీ సింగర్, ఆ గౌరవం నాకు ఎప్పుడూ ఉంటుంది. నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు మీ నుంచి వస్తాయని ఆశిస్తున్నాను. నా వయసు 19 ఏళ్లు.. కానీ రియాలిటీ షో నాకు 15 అనుభవం ఉంది. ఫెయిల్యూర్స్, సక్సెస్ నాకు కొత్త కాదు. ఓటమి తీసుకోవడం లేదని మీరు చెప్పడం సరికాదు అని ప్రవస్తి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X