భర్త వీడియోలో ప్రియాంక హడావిడి

దేశీ గర్ల్ ప్రియాంకా చోప్రా లాక్ డౌన్ లోనూ మస్త్ బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. స్వతహాగా కష్ట జీవిగా పేరుగాంచిన ఈ ముద్దుగుమ్మ అమెరికన్ సింగర్ ను పెళ్లాడాక అక్కడే ఎక్కువగా కాలం వెళ్లదీస్తోంది. అయితే ఆపద సమయంలో దేశానికి తన వంతు సహాయం అందించేందుకు మాత్రం అమ్మడు వెనుకాడటంలేదు. ఈ విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ పోటీపడుతున్నారనే చెప్పాలి.
ది షో అనే రియాలిటీ ద్వారా పాపులర్ అయిన నిక్ జోనాస్ ప్రస్తుతం రెండో సీజన్ తో బిజీగా ఉన్నాడు.

ఇటీవలే ఈ సీజన్ కు సంబంధించిన ఫైనల్స్ లో అంటిల్ వీ మీట్ అగైన్ అనే కొత్త సింగిల్ ను ఆలపించిన నిక్ దాన్నే ఓ ఆల్బమ్ లాగానూ రూపొందించాడు. ఇక కరోనా నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకోవడంతో పాటూ ఆఖరున ప్రియాంకా ఇచ్చిన కేమియో అదిరిపోయిందనే చెప్పాలి.

Priyanka Chopra surprise cameo in Nick latest album

ఇక ఛారీటీ విషయంలో ఈ భార్యభర్తలిద్దరి తరువాతే ఎవరైనా అని చెప్పాల్సిందే. ఇప్పటికే ప్రియాంకా చోప్రా అతివల కోసం ఓ ప్రత్యేకమైన చారీటీ ప్రారంభించింది. కరోనాపై తమదైన శైలిలో పోరాడుతున్న మహిళామణులను సత్కరిస్తూ, వారికి ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కోవిడ్ 19తో పోరాడుతున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లతో పాటూ, ఇతరులు కూడా ఇందుకు అర్హులేనని తెలిపింది.
ఇక తాజాగా నిక్ జోనాస్ కూడా తన కొత్త ఆల్బమ్ ద్వారా వచ్చిన మొత్తంలో కొంత కోవిడ్ బాధితుల కోసం వినియోగించనున్నట్లు ప్రకటించాడు.

అంతేకాదు ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో పాటూ.. అనే సంస్థలకు నిక్, పీసీ పలు దఫాలుగా ఆర్ధిక సహాయం అందించారు. ఆ వివరాలు ప్రియాంకా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ఏమైనా నిక్ తాజా వీడియో వైరల్ గా మారడంతో పాటూ, ఈ జంటపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి ఇదే విధంగా ఈ చక్కని జంట మరిన్ని మంచి పనులు చేయాలని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X