Saami Saami: మరో మాస్ నంబర్ తో వచ్చేసిన దేవి.. రచ్చ మామూలుగా లేదుగా!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా మూవీ ప్రమోషన్ లో భాగంగా మూడో పాటను కూడా రిలీజ్ చేసింది ఈ సినిమా యూనిట్. ఈరోజు కొద్దిసేపటి క్రితమే అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ పాటను పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా లెవెల్ లో
ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా పుష్ప. ముందు ఈ సినిమా ఒకే భాగంగా విడుదల చేయాలని భావించారు కానీ నిడివి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రెండు భాగాలుగా విడుదల చేయాలని భావించారు. అందులో భాగంగా మొదటి భాగాన్ని డిసెంబర్ 17 వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు నిర్మాతలు.

డిగ్లామర్ లుక్ లో
అల్లు అర్జున్ కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో ఒక డిగ్లామర్ లుక్ లో కనిపించబోతున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తిగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

రెండు పాటలకు మంచి క్రేజ్
సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, కన్నడ నటుడు ధనుంజయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ కి బాగా కలిసి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి.

సామీ.. నా సామీ
ముందుగా మాస్ జోనర్ లో విడుదలైన సాంగ్ దాక్కో దాక్కో మేక సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఆ తర్వాత డ్యూయెట్ గా రిలీజ్ అయిన శ్రీ వల్లి సంగ్ కూడా అంతే రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొద్ది సేపటి క్రితం ఈ సినిమా నుంచి సామీ.. నా సామీ అనే సాంగ్ విడుదల చేశారు. నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే, నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామీ.. నా సామీ అంటూ సాగుతున్న ఈ సాంగ్ ఫీమేల్ వర్షన్ లో సాగుతోంది.
Recommended Video

మొత్తం సాంగ్ అప్పుడే
ఈ మొత్తం సాంగ్ 28వ తారీకు ఉదయం 11 గంటల ఏడు నిమిషాలకు విడుదల చేస్తామని పేర్కొన్న సినిమా యూనిట్ ప్రస్తుతానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన సాంగ్ ప్రోమో మాత్రమే విడుదల చేసింది. ఇక ఈ సాంగ్ కూడా సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది అని చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో మరింత ప్రమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగినా, అదేదీ నిజం కాదని చెప్పిన డేట్ కే వస్తామని చెబుతున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











