Daler Mehndi: అక్రమంగా రవాణా.. 'యమదొంగ' సింగర్ కు రెండేళ్ళ జైలుశిక్ష
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎన్నో పాటలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రముఖ గాయకుడు దలెర్ మెహేంది గత కొంతకాలంగా ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అక్రమ మానవ రవాణా కేసులో ఆయనతోపాటు వారి సోదరుడిపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విషయంలో కొన్నిళ్లుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 18 ఏళ్ల కిందట ఆయన సోదరుడు అక్రమంగా విదేశాలకు కొంతమందిని తరలిస్తున్నారు అని అభియోగాలు మోపబడ్డాయి.
ఈ విషయంలో పటియాలకు చెందిన పోలీసులు పలు కేసులు కూడా నమోదు చేశారు. ఇక 19 ఏళ్ల క్రితం నాటి మానవ అక్రమ రవాణా కేసులో దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు 2018లో ఇచ్చిన తీర్పును పాటియాలా సెషన్స్ కోర్టు గురువారం సమర్థించింది.
2003లో దలెర్ పాటలు పాడేందుకు విదేశాలకు వెళ్ళినప్పుడు తనతో పాటు మరి కొంతమందిని తీసుకు వెళ్లేవారు.

అయితే ఎవరైతే విదేశాల్లో స్థిరపడాలని అనుకుంటున్నారు వారికి నుంచి డబ్బులు అందుకుని తాత్కాలిక వీసాలతో విదేశాలకు తీసుకు వెళ్లేవారు. అనంతరం కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత తాత్కాలిక వీసాలతో వెళ్లినవారు అక్కడే స్థిరపడ్డారు. ఈ విధంగా అక్రమ రవాణా కేసులో దలెర్ మెహేంది గత 19 ఏళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక మొత్తానికి ఈ కేసులో దలేర్ మెహందీని కోర్టు దోషిగా నిర్ధారించింది.
2003 సెప్టెంబర్ 19న దలేర్ మెహందీ, అలాగే అతని అన్నయ్య షంషేర్ మెహందీ మ్యూజిక్ బ్యాండ్‌ల ద్వారా ప్రజలను అక్రమంగా విదేశాలకు తీసుకువెళ్లారాని ఆరోపించబడింది. ఆ తర్వాత ఈ కేసులో FIR నమోదు చేయబడింది. పోలీసులు కూడా చాలా కాలంగా ఈ కేసు విషయంలో అనేక ఆధారాలు కూడా సంపాదించారు. అయితే తాను ఏ నేరం చేయలేదు అని దలెర్ మెహేంది పలుమార్లు వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష విధించడం జరిగింది. మరి ఈ విషయంలో జల్లర్ మెహేంది ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక దలెర్ మెహేంది తెలుగులో యమదొంగ సినిమాలో 'నువ్వెంటే పడి పడి చస్తానే' అనే పాట పాడారు. అలాగే మగధీర, రామరామ కృష్ణ కృష్ణ సినిమాల్లో కూడా పాడారు.


Click it and Unblock the Notifications











