పుష్ప కోసం అదిరిపోయే సాంగ్ సిద్ధం చేసిన దేవి శ్రీ ప్రసాద్.. రాబోయేది ఎప్పుడంటే?
అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప విడుదల తరువాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియదు గాని ప్రస్తుతం మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చిన్న విషయం లీక్ అయినా కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇక పుష్ప రాజ్ పాత్ర బాక్సాఫీస్ వద్ద తప్పకుండా సెన్సేషన్ క్రియేట్ చేయగలదు అని టీజర్ తోనే అర్ధమయ్యింది.
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్ గా మారింది. త్వరలోనే మొదటి సాంగ్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రను హైలెట్ చేస్తూ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఆ పాట అభిమానులకు కిక్కివ్వడం కాయమని టాక్. ఇక ఆ పాటను జూలై మొదటి వారంలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

సాధారణంగా దేవి శ్రీ ప్రసాద్ అనగానే సుకుమార్ సినిమాలకు బెస్ట్ సాంగ్స్ ఇస్తాడాని ఒక టాక్ అయితే ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా ముందుగా మ్యూజికల్ హిట్స్ అవుతాయని చెప్పవచ్చు. సుక్కు మేకింగ్ తేడా కొట్టినా కూడా పాటలు మాత్రం ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. ఇక పుష్ప పాన్ ఇండియా సినిమా కాబట్టి అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ అన్ని కూడా రేడి చేశాడట. ఇక మొదటి సాంగ్ ను వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











