Saami Saami Lyrical Song: సౌతిండియా రికార్డు కొట్టిన బన్నీ.. ఒక్కరోజులోనే కోటి దాటేశాడుగా!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ భారీ చిత్రాలు రూపొందుతున్నాయి. అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే తెరకెక్కుతున్నాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'పుష్ప' ఒకటి. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా దానికి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. ఈ క్రమంలోని పుష్ప రాజ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ లెక్కలేంటో చూద్దాం పదండి!

‘పుష్ప'గా రాబోతున్న అల్లు అర్జున్

‘పుష్ప'గా రాబోతున్న అల్లు అర్జున్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది.

ఐకాన్ స్టార్ అయ్యేందుకు సాహసం

ఐకాన్ స్టార్ అయ్యేందుకు సాహసం

'పుష్ప' మూవీ గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఘాటీ రోడ్‌లో లారీ డ్రైవింగ్ నేర్చుకోవడం.. డీ గ్లామర్‌గా కనిపించడం.. చిత్తూరు యాసలో మాట్లాడడంతో పాటు రియల్ స్టంట్స్ చేస్తున్నాడు.

రెండు భాగాలు... షూటింగ్ అప్‌డేట్

రెండు భాగాలు... షూటింగ్ అప్‌డేట్

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక, ఇప్పటికే మొదటి భాగానికి 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు బ్యాలెన్స్ పార్ట్ షూట్ చేస్తున్నారు.

రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టాడు

పుష్ప మూవీ నుంచి ఆ మధ్య 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, ఇటీవలే 'దాక్కో దాక్కో మేక' పాటను వదలగా ఇది దేశ వ్యాప్తంగా ఆదరణ అందుకుని అంచనాలు పెంచేసింది.

సామీ సామీ సాంగ్ రిలీజ్ చేశారుగా

సామీ సామీ సాంగ్ రిలీజ్ చేశారుగా

పుష్ప మూవీ నుంచి గురువారమే 'సామీ సామీ' అంటూ సాగే మాస్ బీట్‌ను కొద్ది సేపటి క్రితమే చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను మౌనిక యాదవ్ అదిరిపోయేలా ఆలపించారు. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ సాంగ్ కూడా గతంలో వాటి మాదిరిగానే సూపర్ హిట్ అయింది.

Recommended Video

Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
సౌత్ ఇండియా రికార్డును కొట్టేశారు

సౌత్ ఇండియా రికార్డును కొట్టేశారు

ఎన్నో అంచనాలతో వచ్చిన 'సామీ సామీ' సాంగ్ 24 గంటల్లోనే 10.2 మిలియన్ వ్యూస్‌ను అందుకుంది. ఫలితంగా ఒకరోజులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన పాటగా ఇది సౌతిండియా రికార్డును క్రియేట్ చేసింది. దీని తర్వాత కూడా 'పుష్ప' మూవీలోని దాక్కో దాక్కో మేక సాంగ్ ఉంది. అంటే దక్షిణాదిలో బన్నీ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X