Pushpa Pushpa Song Review అల్లు అర్జున్ అదరగొట్టేశాడుగా.. సుకుమార్ టేకింగ్ మైండ్ బ్లోయింగ్

భారతీయ సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన చిత్రం పుష్ప. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం పుష్ప ది రూల్ అలియాస్ పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సంచలన దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్నది. రష్మిక మందన్న నటించిన ఈ సినిమాకు సంబంధించిన పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా పాట ఎలా ఉందో మీరే చూడండి..

Pushpa The Rule first single Allu Arjun s Pushpa Pushpa song released

పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్..
పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్..

గడ్డం అట్ట సవరిస్తుంటే..
దేశం అంతా దద్దరిల్లే

పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్..
పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్..

నువ్వు భుజమే ఎత్తి నడిచి వస్తుంటే..
భూమి బద్దలయ్యే..
నువ్వ నిలవాలంటే..
ఆకాశం ఎత్తే పెంచాలే

నిన్ను కొలవాలంటే..
సంద్ర ఇంకా లోతే తవ్వాలే..
పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్..
పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్..

గువ్వ పిట్ట లాగ వానకు తడిసి
బిక్కుమంటు రెక్కలు ముడిసి
వణుకుతు ఉంటే.. నీదే తప్పవదా
పెద్ద గద్దలాగ మబ్బులపైన
హద్దు దాటి ఎగిరావంటే..
వర్షమైనా.. తలనే వంచి
కాళ్ల కింద కురిసేదా

పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్..
పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్..

ఎన్నో వచ్చిన పుష్పకి
పాపం కొన్ని రావంట
వణుకే రాదు..
ఓటమి రాదు..
వెనుకడుగు.. ఆగడం
అసలు రానే రాదు

అన్ని ఉన్న పుష్పకి
పాపం కొన్ని లేవంట
భయమే లేదు
బెంగే లేదు..
బెదురు ఎదురు
తిరుగే లేదు
తగ్గేదే లేదు

దండమెడితే దేవుడికే
సలాం కొడితే గురువులకే
కాళ్లు మొక్కితే అమ్మలకే రా

తల దించినవా? బానిసవి
ఎత్తినావా బాదుషావి
తల పొగరే నీ కీరిటమైతే
భూగోళమంతా నీదేరా

పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్..
పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్..

ఆడు కాలు మీద కాలేసి కూసున్నాడంటే.
బండరాయి కూడా బంగారు సింహాసనమంట
వేరే సింహాసనం.. ఏదైనా వట్టి బండరాయంట
ఆడు సేతిలోనా సేయేసి..నమ్మించాడంటే

పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్..
పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్.. ..

వాడు నీకు గొప్పేంకాదు..
వీడు నీకు ఎక్కువ‌కాదు..
నీకు నువ్వే బాసులా వుండు..
ఎవ‌డో విలువ ఇచ్చేదేంది..
ఎవ‌డొ నిన్ను గుర్తించేదేంది..
వొంటి నిండా తిమ్మోర ఉంటే
నీ పేరే నీ బ్రాండు.. ఇలా పాట సాగింది.

అయితే ఈ పాటను చిత్రకరించిన తీరు హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉంది. సుకుమార్క్ మేకింగ్ మైండ్ బ్లోయింగ్‌ అనిపించేలా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరోసారి అదిరిపోయేలా ఉంది. ఈ పాట సినిమాపై మాస్ జనాల్లో మరింత అంచనాలు, ఆసక్తిని పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X