Kalyanam Lyrical Song: అదరగొట్టిన సిద్ శ్రీరామ్.. పుష్పక విమానం సాంగ్ సూపర్

'దొరసాని' అనే ప్రేమ కథా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాలోనే మంచి నటనతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన అతడు.. విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని ద్వారా అతడు తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, ఇప్పుడు ఈ యంగ్ హీరో నటిస్తోన్న చిత్రం 'పుష్పక విమానం'. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు.

దామోదర అనే కొత్త దర్శకుడితో ఆనంద్ దేవరకొండ చేస్తున్న సినిమానే 'పుష్పక విమానం'. తాజాగా ఈ సినిమాలోని 'కల్యాణం' అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్‌ను స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత విడుదల చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో చిత్ర యూనిట్‌కు బెస్ట్ విసెష్ తెలియజేసింది. రామ్ మిరియాల కంపోజ్ చేసిన ఈ పాటను సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. మంగ్లీ, మోహన భోగరాజు, దివ్య మాళిక, హరిప్రియ కోరస్ ఇచ్చారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. సాఫ్ట్‌గా సాగిపోతోన్న ఈ మెలోడీ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. దీంతో ఇది కొద్ది సమయంలోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది.

Pushpaka Vimanam Kalyanam​ Lyrical Song Released

భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న ఆనంద్ దేవరకొండ 'పుష్పక విమానం' ద్వారా ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు దర్శకుడు దామోదర. ఇక, ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ బాషీ, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాన్వి మేఘన, గీత సైని హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, సునీల్, నరేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X