twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖుడి మృతి.. ఏఆర్ రెహ్మాన్ సంతాపం

    |

    బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకొన్నది. మ్యూజిక్ రంగంలో వినూత్నమైన సృజానాత్మకతకు బాటలు వేసిన క్యోంకి డిజిటల్ మ్యూజిక్ ఫ్లాట్‌ఫాం సహ వ్యవస్థాపకులు, సీఈవో సమీర్ బంగారా ఇక లేరు. ముంబై నగర పరిసర ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు క్యోంకి ఉద్యోగులు ట్వీట్ చేశారు. ఆదివారం ఉదయం నగర శివారులో జరిగిన మోటార్ సైకిల్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దీంతో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్‌తోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

    క్యోంకి సంస్థ ట్విట్టర్‌లో విషాద వార్తను షేర్ చేస్తూ...సమీర్ బంగారా ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతారు. సమీర్ మరణవార్తతో మేమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఈ లోటును ఎలా జస్టిఫై చేయాలో ఊహకు అందడం లేదు. ఈ విషాదం నుంచి తేరుకొని ఆయన కుటుంబానికి, సన్నిహితులకు అండగా ఉండటానికి మానసికంగా సిద్ధమయ్యాం అని క్యోంకి సహ వ్యవస్థాపకులు సాగర్ గోఖలే తెలిపారు.

    Qyuki CEO Samir Bangara died in road accident in Mumbai, Music World mourns

    సమీర్ బంగారా మరణంపై ఏఆర్ రెహ్మాన్ స్పందిస్తూ.. ఓ మంచి మిత్రుడిని కోల్పోయాను. మానవత్వం ఉన్న మనిషి. గొప్ప విజన్ కలిగిన వ్యాపారవేత్త. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    సమీర్ బంగర్ మృతితో షాక్ తిన్నామని బాలీవుడ్ సంగీత ప్రముఖులు.. రోనీ స్క్రీవాలా, అనుపమ్ మిట్లల్, విషాల్ దద్లానీ తదితరులు శ్రద్దాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాని భగవంతుడిని ప్రార్థించారు.

    English summary
    Qyuki CEO Samir Bangara died in road accident in Mumbai out skirts on Sunday morning. Including AR Rahman and other perosnalities of Music World mourns in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X