Radheshyam: ఇండియన్ సినిమా హిస్టరీలో మొదటిసారి విభిన్నమైన సాంగ్.. డిఫరెంట్ మ్యాజిక్!

ెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అసలైతే ఈ ఏడాది దసరా సమయంలోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల ప్రభావం వలన వాయిదా వేయక తప్పలేదు. మొత్తానికి నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ వచ్చే ఏడాది సినిమాను జనవరిలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక రెగ్యులర్ గా సినిమాకు సంబంధించిన పాటలను కూడా విడుదల చేస్తున్నారు. సినిమా లోని మరొక పాటను రేపు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. మొదటి సారి ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఒక విభిన్నమైన పాటను వినిపించ పోతున్నట్లు పోస్టర్ను వదిలారు.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. తదుపరి సినిమా రాధేశ్యామ్ పై అయితే అంచనాలు మామూలుగా లేవు. తప్పకుండా సినిమా అంతకు మించి అనేలా ఉంటుంది అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ చాలా ఆలస్యంగా చేస్తోంది అనే ఆరోపణలు ఎన్నో వస్తున్నాయి. అంతే కాకుండా అప్ డేట్స్ కూడా సినిమాపై పెద్దగా హైప్ క్రియేట్ చేయడం లేదు. ప్రభాస్ నటిస్తున్నాడు అనే అంశం తప్ప సినిమాపై మరో హైప్ అయితే క్రియేట్ అవ్వడం లేదు.

Radheshyam second song update one heart tow heartbeats

ఇక ఈ సారి రెండవ పాటతో ఎలాగైనా సినిమాపై మరింత అంచనాలను క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. రాధేశ్యామ్ నుండి ఊపిరి పీల్చుకునే తదుపరి పాట లవ్ ఆన్తేమ్ కోసం మార్గం చేయండి. భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఒకే హృదయ, రెండు హృదయ స్పందనలు అనేలా రెండు విభిన్న సంగీత అనుభవాలతో ఒకే చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది.. అని వివరణ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ ఎవరూ చూడని ఒక విభిన్నమైన పాటలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

హిందీలో మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక పాటను విడుదల చేస్తుండగా.. తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నారు. మరి రాధేశ్యామ్ రెండవ పాట ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలోని ప్రతి పాట కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని ఇదివరకే చిత్ర యూనిట్ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. మొదటి పాటకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక రెండవ పాట ఎంతవరకు ఆకట్టుకుంటుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో అయితే ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది. హిందీలో కూడా అంచనాలు పాజిటివ్ గానే ఉన్నాయి. ఇక తమిళ్ అలాగే మిగతా భాషల్లో బజ్ క్రియేట్ అవ్వాలి అంటే పాటలు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఆ తరువాత ప్రభాస్ సలార్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X