ఎస్పీబీ పాడిన చివరి పాటపై వివాదం.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య చిచ్చు!!

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. కానీ ఆయన సుమధురమైన గాత్రం, ఆయన పాడిన పాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి. అయితే ఎస్పీబీ మరణం తరువాత ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. ఆయన అంత్య క్రియలకు టాలీవుడ్ హాజరు కాలేదని, ఆయన హాస్పిటల్ బిల్లులు ఎవరో చెల్లించారని ఇలా ఏవేవో కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వివాదం బయటకు వచ్చింది.

చివరి పాటపై..

చివరి పాటపై..

తెలుగులో ఎస్పీబీ పాడిన చివరి పాట ఏది అంటూ అందరూ ఆలోచనలో పడ్డారు. వెదుకులాట ప్రారంభించారు. అయితే చివరగా పాడింది తమకే అంటూ సంగీత దర్శకులు రఘుకుంచె, రవివర్మలు చెప్పుకుంటున్నారు. పలాస చిత్రానికి చివరిగా పాడాడని రఘుకుంచే అంటే.. కాదు కాదు ‘చీమ ప్రేమ మధ్యలో భామ'అనే నా సినిమాకు పాడారంటూ రవి వర్మ అంటున్నాడు.

చివరి మాటలివే..

చివరి మాటలివే..

‘చీమ ప్రేమ మధ్యలో భామ' అనే చిత్రంలో పాట పాడే సందర్భంలో పాట గురించి ఎస్పీబీ మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. నేను చాలా అరుదుగానే ఓ పాట గురించో, సినిమా గురించో మాట్లాడటానికి మీ ముందుకు రాను. కొన్ని సందర్భాల్లో ప్రెషర్స్‌ వల్ల కూడా మాట్లాడాల్సి ఉంటుంది అని ఎస్పీబీ చెప్పుకొచ్చారు.

ఎన్నో వేరియేషన్స్‌తో

ఎన్నో వేరియేషన్స్‌తో

చీమ ప్రేమ మధ్యలో భామ సినిమా గురించి నేను ఎలాంటి ప్రెజర్‌ లేకుండా మాట్లాడుతున్నాను. ఆ సినిమా పేరే తమాషాగా ఉంది. ఈ సినిమాలో ఓ పాట పాడే అవకాశాన్ని నిర్మాతలు, సంగీత దర్శకుడు నాకు ఇచ్చారు. నా గొంతుతో రకరకాల విన్యాసాలు చేయడానికి ఒక అవకాశం దొరికిందని ఎస్పీబీ మాట్లాడిన వీడియో, ఎన్నో వేరియేషన్స్‌తో పాడిన పాట వైరల్ అవుతోంది.

Recommended Video

#SPBalasubramaniam : Sekhar Kammmula,Boyapati Srinu,Raghu Kunche Expresses Their Condolences For SPB
ఏది చివరి పాట..

ఏది చివరి పాట..

అయితే కొన్ని చోట్లు ఎస్సీబీ పాడిన చివరి తెలుగు పాట ఇదే అంటూ 'పలాస 1978' సినిమా కోసం రఘు కుంచె స్వరపరిచిన 'ఓ సొగసరి' అనే వాదన వినిపిస్తోంది. మరికొన్ని చోట్ల చీమ ప్రేమ మధ్యలో భామ అని ఉంది. ఈ రెంటిలో ఎస్పీబీ చివరగా పాడిన పాట ఏదని నెటిజన్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. తమిళంలో అయితే రజినీకాంత్ కోసం అన్నాత్తె (అన్నయ్య) అనే సినిమాలో పాడినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X