twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిచ్చోడి చేతిలో రాయి.. సైకో వర్మ మన భాయ్.. రాహుల్ సిప్లిగంజ్ పాట వైరల్

    |

    రామ్ గోపాల్ వర్మ ఈ లాక్ డౌన్‌లో కరోనా వైరస్ కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఆయన ఈ లాక్ డౌన్‌లో ఎన్ని సినిమాలు తీశాడో, తీయాలి అనుకుంటున్నాడో అంతకు మించిన సినిమాలు ఆయనపై తెరకెక్కిస్తున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆయన బయోపిక్‌ను ఆయనే తీసుకోవడం. ఇది కాక మరి కొన్ని చిత్రాలు కూడా రెడీ అవుతున్నాయి. అందులోంచి ఓ చిత్రమే సైకో వర్మ.. వీడు తేడా అనేది ఉప శీర్షిక.

    ఆర్జీవీపై చిత్రాలు..

    ఆర్జీవీపై చిత్రాలు..

    ఆర్జీవీపై ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాలు రాబోతోన్నాయని ప్రకటించారు. అందులో ఆర్జీవీ (రోజూ గిల్లే వాడు) ఆర్జీవీ (రాంగ్ గోపాల్ వర్మ), ఆర్జీవీ ( రాడ్ గోపాల్ వర్మ) ఇలా ఏవేవో చిత్రాలు రాబోతోన్నాయి. ఇప్పటికే పరాన్న జీవి అనే సెటైరికల్ చిత్రం కూడా వచ్చింది. అది బాగానే ఆడింది కూడా.

    సైకో వర్మ అంటూ..

    సైకో వర్మ అంటూ..

    ఇక తాజాగా సైకో వర్మ అనే కొత్త సినిమా ఆర్జీవీపై రాబోతోంది. ఈ చిత్రాన్ని నట్టి కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ పాటకు సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడుతున్నాయి. చిన్నగా ఓ గ్లింప్స్ లాంటిది కూడా వదిలారు. అది ప్రస్తుతం తెగ హల్చల్ చేస్తోంది.

    పిచ్చోడి చేతిలో రాయి..

    పిచ్చోడి చేతిలో రాయి..

    పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మ నే మన భాయ్ అంటూ రాహుల్ ఆలపించిన పాట బాగానే ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాటను సెప్టెంబర్ 1 ఉదయం 9 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఇక మరి ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండుగలానే ఉండబోతోంది. ఎందుకంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఓ రేంజ్‌లో ఉండగా.. ఈ పాటతో పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారేమో.

    Recommended Video

    Rahul Sipligunj New Look Shocks His Fans
     రాము బయోపిక్..

    రాము బయోపిక్..

    ఇవే గాక ఆర్జీవీ తెరకెక్కించబోతోన్న రాము చిత్రం ఫస్ట్ లుక్ కూడా బాగానే క్లిక్కయింది. ఆర్జీవీ తన బయోపిక్‌ను మూడు పార్ట్‌లు తెరకెక్కించబోతోన్నట్టు వివరించాడు. ఒక్కో పార్ట్‌లో ఏయే అంశాలు ఉండబోతోన్నాయో కూడా తెలిపాడు. సెప్టెంబర్ రాము సెట్స్‌పైకి వెళ్లబోతోందని తెలిపాడు.

    English summary
    Rahul Sipligunj Song On RGV In psycho varma Movie. yrical song coming soon.. movie #psychovarma by Natti kumar
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X