అదిరిపోయిన దర్భార్ ఫస్ట్ సింగిల్.. విజృంభించిన ఎస్పీబీ
సూపర్ స్టార్ రజినీ కాంత్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొట్ట మొదటిసారిగా ఈ కాంబినేషన్ సెట్ అవడంతో తలైవా ఫ్యాన్స్ సంబరాల్లో తేలిపోయారు. భిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరున్న మురుగదాస్.. తలైవాను ఎలా చూపిస్తాడా? అని ఫ్యాన్స్ అందరూ ఉత్కంఠగా ఎదరుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్ తాజాగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసింది.
ఎస్పీబీ పాడిన ఈ పాటను నేటి సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేసింది చిత్రబృందం. దుమ్ము ధూళి అంటూ ప్రమోట్ చేసిన ఈ సాంగ్‌ను ఎస్పీబీ ఫుల్ ఎనర్జీతో పాడాడు. మాస్ బీట్స్‌తో అదరగొట్టే అనిరుధ్.. మరోసారి తలైవా ఫ్యాన్స్‌ను ఊగిపోయేలా చేశాడు. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఇంతకుముందే పేటా సినిమాతో ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే.

నయనతార, నివేదా థామస్ లాంటి వారు నటిస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ముంబై గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రజినీ ఏసీపీ ఆదిత్య అరుణాచలం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications











