సూపర్ స్టార్ రేంజ్ అంటే అది.. షేక్ చేస్తోన్న ఫస్ట్ సింగిల్
సూపర్ స్టార్ రజినికాంత్ అంటే విషయం మామూలుగా ఉండదు. అదీ తమిళ నాట అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. తలైవా సినిమా వస్తోందంటే ఉండే హడావిడే వేరు. ఆరుపదుల వయసు దాటినా.. యంగ్ హీరోల కంటే స్పీడుగా షూటింగ్‌లను పూర్తిచేసి చకచకా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. తాజాగా దర్బార్ చిత్రంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన రజినీ కాంత్.. ఫస్ట్ సింగిల్‌తో రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు.
చుమ్మాకిళి (దుమ్ముధూళి) అంటూ నిన్న (నవంబర్ 27) విడుదల చేసిన లిరికల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఈ పాటను సోషల్ మీడియాలో ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది మిలియన్ల వ్యూస్ సాధించిన మొట్టమొదటి తమిళ పాటగా రికార్డులు సృష్టించినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఎస్పీబీ ఫుల్ ఎనర్జీతో పాడిన ఈ పాట ట్యూన్‌పై విమర్శలు వచ్చినా.. రికార్డులు సృష్టించడంలో దూసుకుపోతూనే ఉంది.

టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్, రజినీకాంత్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మొదటి చిత్రంపై అభిమానుల్లో ఎన్నో అంచనాలున్నాయి. ముంబై గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ ఆదిత్యా అరుణాచలం అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. నివేదా థామస్, నయనతార ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











