నైట్ క్లబ్‌లో రకుల్.. బెడ్ రూమ్ సీన్లు, మందు బాటిళ్లు.. సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో

యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో బెడ్ రూమ్ సీన్స్‌తో పాటు మందు, రకుల్ అందచందాలు బాగా ఫోకస్ కావడంతో జనం షాక్ అవుతున్నారు. రకుల్ ఇలా చేసిందేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియో ఎక్కడిది? రకుల్ చేసిందేంటి? వివరాల్లోకి పోతే..

హీరోయిన్స్ అన్నాక తప్పదుగా..

హీరోయిన్స్ అన్నాక తప్పదుగా..

ఎవరి వృత్తిలో వారికి కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ ఉంటాయి. అట్లే గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కి రొమాంటిక్ సీన్స్, అందాల ఆరోబోత అనేది తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో పాత్ర డిమాండ్ చేస్తే రెచ్చిపోయి రొమాన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితి రకుల్‌కి ఎదురైంది. హీరోయిన్స్ అన్నాక తప్పదుగా! అన్నట్లుగా రెచ్చిపోయి పర్‌ఫార్మ్ చేసింది రకుల్.

క్లబ్ డ్యాన్సర్‌.. రకుల్ ప్రీత్ సింగ్

క్లబ్ డ్యాన్సర్‌.. రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కీర్తించబడుతున్న రకుల్.. బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ మేరకు పాత్ర ఏదనేది చూడకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. అందులో భాగంగానే 'మర్జావా' అనే సినిమాలో క్లబ్ డ్యాన్సర్‌ రోల్ చేసింది రకుల్. సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా జంటగా నటించిన ఈ సినిమాలో బీ టౌన్ ప్రేక్షకులకు రకుల్ అందాలను ఎరగా వేశారు మేకర్స్.

ఒంటిపై టాటూ.. అదరహో రకుల్

ఒంటిపై టాటూ.. అదరహో రకుల్

ఈ మేరకు తాజాగా 'మర్జావా' సినిమాలోని ‘హయ్యా హో' అనే ఐటెం సాంగ్‌ రిలీజ్ చేశారు. ఈ పాటలో క్లబ్ డ్యాన్సర్‌‌గా రకుల్ వేసిన స్టెప్పులు మత్తెక్కిస్తున్నాయి. బెడ్ రూమ్ సీన్లు, మందు బాటిళ్లు అబ్బో అనిపిస్తున్నాయి. ఒంటిపై టాటూ వేసుకొని క్లబ్‌లో రకుల్ చేస్తున్న అందాల విందు మైమరిపిస్తోంది. బీట్‌కి తగ్గట్టుగా రకుల్ చిందులు అదరహో అంటున్నాయి. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

చూస్తుంటే ఆమె అందాల విందుకు

ఇటీవలే బాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ నటించిన ‘దే దే ప్యార్ దే' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సో.. ఇప్పుడు ‘మర్జావా' సినిమా ద్వారా మరోసారి బీ టౌన్ జనాన్ని మాయ చేయబోతోంది రకుల్. చూస్తుంటే ఆమె చేసిన అందాల ఆరబోతకు బాలీవుడ్ ప్రేక్షకులు పడిపోవడం ఖాయం అనిపిస్తోంది.

సీనియర్ హీరోతో రొమాన్స్.. ఫిక్స్ అయిన రకుల్

సీనియర్ హీరోతో రొమాన్స్.. ఫిక్స్ అయిన రకుల్

రొమాన్స్ సన్నివేశాలకు తాను ఎప్పుడూ సిద్దమే అన్నట్లుగా ఇటీవలే హింట్ ఇచ్చింది రకుల్. సీనియర్ హీరో నాగార్జునతో మన్మథుడు 2 సినిమాలో రొమాన్స్ చేసి కిక్కిచ్చింది. ఈ లెక్కన చూస్తే ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ జనాన్ని తన రొమాంటిక్ సన్నివేశాలతో మత్తెక్కించాలని ఫిక్స్ అయినట్లుంది రకుల్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X