Ayalaan సూపర్ హీరోతో చిందేసిన రకుల్ ప్రీత్ సింగ్.. గ్రహాంతరవాసితో రొమాంటిక్‌గా స్టెప్పులు!
తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్, గ్లామర్ క్ల్వీన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అయలాన్. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై కేజే రాజేశ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఈ క్రమంలో విడుదల చేసిన పాట సంగీత ప్రియులను ఆకట్టుకొంటున్నది. శివ కార్తీకేయ, రకుల్, ఏలియన్‌పై చిత్రీకరించిన పాట వివరాల్లోకి వెళితే..
సైన్స్ ఫిక్షన్, ఏలియన్ (గ్రహాంతర వాసి) ప్రధాన పాత్రలో విభిన్నమైన కథ, కథనాలతో వస్తున్న అయలాన్ సినిమాలోని సురో సురో వచ్చేయ్‌రో అనే పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించారు. ఈ సాంగ్‌కు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. మెరుపే ఇలా..కురిసిందా.. నిప్పై ఇలా జగం తడిసిందా? వచ్చాడని తెలిసిందా అంటూ మంచి బీట్‌తో జోష్‌తో సాగిన పాటలో లిరిక్స్ క్రేజీగా ఉన్నాయి. ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సూరో సూరో సూపర్ హీరో అంటూ సాగే పాటలో కిళిక్‌స్థాన్ మ్యూజిక్ నేర్చుకో.. డ్యాన్స్ ఫ్లోర్ బద్దలవ్వగా అంటూ సాగే పాటపై రకుల్ ప్రీత్ సింగ్, శివ కార్తీకేయన్ స్టెప్పులతో ఆకట్టుకొన్నారు. ఈ పాటలో ఏలియన్ కూడా ఉండటంతో మరింత స్పెషల్ ఎట్రాక్షన్ మారింది. సినిమాను చూడాలనే ఆసక్తిని ఆ పాట క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.

సూరో సూరో సూపర్ స్టార్ అనే పాటలో నీ శ్వాసే సూర్యునుసూరు.. శత్రువు అందం ముదు అనే సాహిత్యం యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ పాటను నకుల్ అభ్యంకర్ స్టైలిష్‌గా ఆలపించారు. యూత్‌కు కనెక్ట్ అయ్యే ఫిలాసఫీతో ఈ పాట సాగింది.
ఇండియన్ సినిమా రంగంలో ఇంతకు ముందెన్నడూ రానటువంటి కథతో వస్తున్న చిత్రంలోని
సూరో సూర్ సూపర్ స్టార్ పాటపై రకుల్ ప్రీత్ సింగ్, శివకార్తీకేయన్ జంటగా క్రేజీగా ఉంది. వీరిద్దరి మధ్య ఏలియన్ అదనపు ఆకర్షణగా మారింది. వినగానే ఈ పాట తప్పకుండా టాప్ చార్ట్‌లో నిలుస్తుందనే ఫీలింగ్ కలిగింది.
నటీనటులు: శివకార్తీకేయన్, రకుల్ ప్రీత్ సింగ్, కరుణాకరన్, యోగిబాబు, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ తదితరులు
రచన, దర్శకత్వం: ఆర్ రవికుమార్
సినిమాటోగ్రఫి: నీరవ్ షా
ఎడిటింగ్: రూబెన్
క్యాస్టూమ్స్: నీరజ కోన
బ్యానర్: కేజీఆర్ స్టూడియోస్
నిర్మాత: కేజే రాజేశ్


Click it and Unblock the Notifications











