గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు.. అర్దశతాబ్దం కోసం రకుల్ ప్రీత్
చిన్న సినిమాలపై బజ్ క్రియేట్ చేయాలంటే అంత సులభం కాదు. కంటెంట్ ఎంత కొత్తగా ఉన్నా కూడా ముందు జనాలకు రీచ్ అవ్వడం చాలా కష్టం. కానీ ఇండస్ట్రీలోని స్టార్స్ చేతుల మీదుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయిస్తే మాత్రం కచ్చితంగా అందరికీ తెలుస్తుంది. అలా చేశారు కాబట్టే.. అర్ధశతాబ్దం అనే చిత్రం ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అర్ద శతాబ్ధం.
సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ని దగ్గుబాటి రానా రిలీజ్ చేయగా.. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రకుల్ ప్రీత్ కూడా ఓ చేయి వేసింది. ఈ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేసింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను రకుల్ ప్రీత్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అసలే ఇప్పుడు సిద్ శ్రీరామ్ ఫుల్ ట్రెండింగ్‌లొ ఉన్నాడు. ఆయన పాడిన ప్రతీ పాట అందరినీ ఆకట్టుకుంటోంది.

ఏ కనులు చూడని చిత్రమే పాటను రిలీజ్ చేసిన అనంతరం రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. అర్దశతాబ్దం పోస్టర్, టీజర్ చూశాను.. చాలా బాగున్నాయి. ఏకనులు చూడని చిత్రమే సాంగ్ వింటుంటే మెలోడియస్, రొమాంటిక్ ఫీల్ వస్తుంది. అష్కర్ ఫోటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. విజువల్స్ అన్నీఅద్భుతంగా ఉన్నాయి.. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో బాగానే క్లిక్ అయింది.


Click it and Unblock the Notifications











