Game Changer: హీరోయిన్‌తో రామ్ చరణ్ రొమాన్స్.. తెలుగు సినిమాల్లో తొలిసారి ఇలా!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఏడాదికి ఒకటి రెండు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు వస్తుండేవి. అయితే, ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో ప్రతి స్టార్ హీరో నుంచి ఒక హై మూవీ వస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా మారిన స్టార్లు వరుస చిత్రాలు చేస్తున్నారు. అలా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు 'గేమ్ చేంజర్' మూవీ చేస్తోన్నాడు.

లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్‌తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తోన్న సినిమానే 'గేమ్ చేంజర్'. నెక్ట్స్ లెవెల్ కాంబినేషన్‌ కావడంతో పాటు పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

Ram Charan and Kiara Advani Romantic Song Highlight in Game Changer Movie

సెన్సేషనల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో బ్రేకులు రావడంతో ఇప్పటి వరకూ షూట్ కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా వీలైనంత త్వరగా అన్నీ పూర్తి చేసి మూవీని అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నారు.

హై రేంజ్ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ గురించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం రామ్ చరణ్, కియారా అద్వాణీ మధ్య అదిరిపోయే రొమాంటిక్ సాంగ్‌ను పెట్టినట్లు తెలిసింది. ఇది మూవీ ఫస్టాఫ్‌లోనే వస్తుందని అంటున్నారు.

'గేమ్ చేంజర్' మూవీలో పెట్టబోతున్న రొమాంటిక్ సాంగ్ గతంలో ఏ తెలుగు సినిమాల్లోనూ చూపించని విధంగా ఉంటుందట. అంతేకాదు, ఇందులో శంకర్ మార్క్ బ్యాగ్రౌండ్ థీమ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఒక్క పాట కోసం దాదాపు రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నారని కూడా తెలిసింది. ఈ షూట్ వచ్చే వారమే ప్లాన్ చేశారని కూడా ఒక వార్త తాజాగా బయటకు వచ్చింది. దీంతో ఈ సాంగ్‌పై హైప్ పెరిగిపోతూనే ఉంది.

Ram Charan and Kiara Advani Romantic Song Highlight in Game Changer Movie

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - శంకర్ కాంబోలో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీలో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X