రామ్ చరణ్ సినిమా కోసం ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. బుచ్చిబాబు బిగ్ ప్లాన్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్నో కేజీ ప్రాజెక్టులు తెరపైకి రాబోతున్నాయి. అయితే అనౌన్స్ చేసిన తర్వాత దర్శకులకు మిగతా నటీనటులని అలాగే టెక్నీషియన్స్ ను సెలెక్ట్ చేయడం చాలా కష్టమైన జాబ్ గా మారిపోయింది. ఒక్కసారి సెట్ అయితే అంత బాగానే ఉంటుంది కానీ ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే విషయంలోనే చాలా కాలం పాటు ఆలోచిస్తున్నారు.
ఇక రామ్ చరణ్ తేజ్ RC 16 ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ లో మొదలు అవుతుంది అని ఇదివరకే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇక రాంచరణ్ కూడా ఆ ప్రాజెక్టు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ ను వీలైనంత త్వరగా ఫైనల్ చేయాలి అని బుచ్చిబాబు కూడా డిసైడ్ అయ్యాడు.

అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే విషయంలో ఇదివరకే అనేక రకాల కథనాలు వెలుపడ్డాయి. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఏఆర్ రెహమాన్ ను తీసుకోవాలని రామ్ చరణ్ బుచ్చిబాబు చర్చలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. రెహమాన్ ఇంతకుముందు తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే.
ముఖ్యంగా మహేష్ బాబు 'నాని' - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కొమరం పులి సినిమాలకు మంచి మ్యూజిక్ అందించాడు. కానీ ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఆ మధ్యలో మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా కోసం కూడా మొదట రెహమాన్ ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఎందుకో మళ్లీ ఆయన వెనుకడుగు వేశారు.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు RC 16 వ ప్రాజెక్టు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో అధికారికంగా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా త్వరలోనే ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మృణాల్ ఠాగూర్ ని అనుకుంటున్నట్లుగా టాక్ వస్తోంది కానీ ఇప్పటివరకు అయితే చిత్ర యూనిట్ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











