దేవీ మళ్లీ చించేశాడు.. ఉప్పెన సాంగ్‌పై రామ్ చరణ్ కామెంట్స్
గత కొన్ని రోజులుగా రాక్ దేవీ శ్రీ ప్రసాద్ విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఓ వైపు తమన్ కొత్త సంగీతాన్ని అందిస్తుంటే.. దేవీ మాత్రం నిరాశ పరుస్తున్నాడని కామెంట్స్ వినిపించాయి. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు ఆల్బమ్స్‌ను పోల్చుతూ అప్పట్లో తెగ కామెంట్స్ చేశారు సంగీత ప్రియులు. అయితే దేవీ నుంచి తాజాగా వస్తోన్న పాటలు చూస్తుంటే మళ్లీ గతంలోకి తీసుకెళ్లేట్టు కనిపిస్తోంది.
దేవీ ప్రస్తుతం సంగీతం అందిస్తున్నచిత్రం ఉప్పెన. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఉప్పెనకు దేవీ సంగీతం ప్లస్ అయ్యేట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన రెండు పాటలకు విశేషమైన స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారిన ఈ పాటలపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామెంట్స్ చేశాడు.

నేడు విడుదలైన దక్ దక్ దక్ వీడియో సాంగ్ ఎంతలా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే.అసలే నీ కన్ను నీలి సముద్రం అనే పాటే వెంటాడుతూ ఉంటే తాజాగా దక్ దక్ దక్ అనే పాట వచ్చి పిచ్చెక్కిచ్చింది. ఈ పాటపై రామ్ చరణ్ స్పందిస్తూ.. మరోసారి దేవీ అదరగొట్టేశాడని కామెంట్ చేశాడు. క్రితి శెట్టి హీరోయిన్‌గా వస్తోన్న ఉప్పెన ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











