Game Changer: మెగా ఫ్యాన్స్‌కు మరో షాక్.. అతడిని మార్చడంతో వాయిదా!
బడా సపోర్టుతోనే సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్లను చూపించి చాలా తక్కువ సమయంలోనే పెద్ద స్టార్‌గా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హీరోగా ఎక్కువ శాతం విజయాలను సొంతం చేసుకున్న అతడు.. క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే RRR మూవీతో గ్లోబల్ స్టార్ అన్న బిరుదును సైతం అందుకున్నాడు.
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా మధ్యలో కొన్ని అనుకోని ఆటంకాలు వచ్చాయి. ఇలా ఇన్ని రోజుల వ్యవధిలో కేవలం 60 శాతానికి పైగానే షూట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నారు.

'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతున్నా.. దీని నుంచి పెద్దగా అప్‌డేట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాలోని మొదటి పాట 'జరుగండి'ని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారని ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు పండుగ కానుక విషయంలో ఫుల్ ఖుషీ అయ్యారు.
రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుందని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతోన్న నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ పాటను దీపావళి కానుకగా విడుదల చేయడం లేదట. దీనికి సంబంధించిన వర్క్ పూర్తి కాని కారణంగా చిత్ర యూనిట్ సాంగ్‌ను వాయిదా వేసినట్లు తెలిసింది.

'గేమ్ చేంజర్' సాంగ్ వాయిదా వెనుక కారణం కూడా బయటకు వచ్చింది. ఇప్పటికే లీకైన సాంగ్‌పై ట్రోల్స్ రావడంతో ఈ పాటను థమన్ రీ రికార్డ్ చేయబోతున్నాడట. ఇందులో భాగంగానే సింగర్‌ను కూడా మార్చాడని తెలిసింది. దీనికి కాస్త సమయం పట్లే అవకాశం ఉండడంతో దీన్ని వాయిదా వేయబోతున్నారట. ఈ పోస్ట్‌పోన్ అనౌన్స్‌మెంట్ ఈరోజో, రేపు రానుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











