Game Changer: మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. గేమ్ చేంజర్ నుంచి ఊహించని ట్రీట్
తెలుగు చిత్ర పరిశ్రమంలో భారీ స్థాయిలో మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్న స్టార్ హీరోలు అతి తక్కువ మందే ఉన్నారు. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా అతడు వరుసగా హిట్లను సాధిస్తూ.. క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. దీనికితోడు RRR(రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో గ్లోబర్ స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తూ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను చేసుకుంటూ వెళ్తున్నాడు.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్‌తో కలిసి 'గేమ్ చేంజర్' అనే మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు వచ్చాయి. అయినప్పటికీ దీనికి సంబంధించిన 60 శాతానికి పైగానే షూట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఇక, మిగిలిన పార్టును కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసేలా చిత్ర యూనిట్ ప్లాన్లు రెడీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

'గేమ్ చేంజర్' సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతున్నా.. దీని నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరే ప్రచార చిత్రమో, పాటనో విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ మూవీ నుంచి ఓ పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. రామ్ చరణ్ మూవీలోని మొదటి సాంగ్‌ను దసరా కానుకగా విడుదల చేయబోతున్నారట. ఇంకా దీనికి డేట్ ఫిక్స్ చేయలేదని తెలిసింది. ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ పాట విడుదలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











