Game Changer: మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రామ్ చరణ్ నుంచి ఇప్పట్లో కష్టమేనట

మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. ఆరంభంలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ మెగా పవర్ స్టార్ అనిపించుకున్నాడు రామ్ చరణ్. దీనికితోడు ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలోనే పెంచుకున్నాడు. దీంతో తన రేంజ్‌ పెంచుకునే సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్నాడు.

ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో సత్తా చాటుతోన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాజమౌళి తెరకెక్కించిన RRR(రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో ప్రపంచ స్థాయికి ఎదిగిపోయాడు. ఫలితంగా గ్లోబర్ స్టార్‌ అనే బిరుదును సైతం సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తూ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు.

Ram Charan Game Changer Movie First Song Release Postponed

ప్రస్తుతం రామ్ చరణ్.. సౌతిండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ శంకర్‌ రూపకల్పనలో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు వచ్చాయి. ఇలా సుదీర్ఘమైన ప్రయాణంలో కేవలం 60 శాతానికి పైగానే షూట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు.

'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూట్ మొదలై చాలా కాలమే అవుతున్నా.. దీని నుంచి ప్రచారం చిత్రాలు అస్సలు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాలోని మొదటి పాటను దసరా కానుకగా విడుదల చేయబోతున్నారని ఇటీవలే ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో మెగా అభిమానులు పండుగ కానుక విషయంలో ఫుల్ ఖుషీ అయ్యారు.

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుందని అభిమానులు ఆనంద పడుతోన్న తరుణంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ పాటను దసరా కానుకగా విడుదల చేయడం లేదట. దీనికి సంబంధించిన వర్క్ పూర్తి కాని కారణంగా చిత్ర యూనిట్ సాంగ్‌ను వాయిదా వేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇక, రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X