పవర్ఫుల్ సర్‌ప్రైజ్ కోసం సిద్దమైన మెగా హీరోలు.. చాలా కాలం తరువాత బిజీబిజీగా..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఆచార్య టాప్ లిస్ట్ లో ఉందని చెప్పవచ్చు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. అసలైతే ఈపాటికే భారీ స్థాయిలో సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా అలాగే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొనడంతో సినిమాలు వాయిదా వేయక తప్పలేదు. ఇక ప్రస్తుతం అయితే రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ తీసుకోలేదు. కానీ ఈ సినిమా షూటింగ్ కోసం ఎప్పటిలానే కష్టపడుతుంది..
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ తేజ్ కూడా కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఎలాగూ సినిమా రిలీజ్ వాయిదా పడింది కాబట్టి కాస్త మెల్లగా నేను మిగతా షూటింగ్ పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు కలిసి కెమెరా ముందు కనిపించి చాలా కాలం అయ్యింది. వీరిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన పాటను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ అన్నీ కూడా ఫినిష్ అయ్యాయి. ఇంకా మిగిలిన ఒక పాటను కూడా పూర్తి చేస్తే షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లే. రామ్ చరణ్, మెగాస్టార్ కాంబినేషన్ లో వచ్చే ఆ పాట అభిమానులకు పునకాలు తెప్పిస్తుందట. త్వరలోనే పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు.

ఇక రామ్ చరణ్ తేజ్ మరోవైపు RRR సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆచార్య సినిమాను కూడా అదే సమయంలో ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకున్నారు. కానీ ఎంత ట్రై చేసిన వర్కవుట్ అవ్వడంలేదు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ సమయానికి కుదరకపోతే సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆచార్య సినిమా విషయంలో మెగాస్టార్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
సినిమాను ఎలాగైనా హాలిడే సీజన్ లోనే విడుదల చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. కొరటాల శివ ఇదివరకే నిర్మాతలతో మాట్లాడారు. ఇక ఈ నెల 20న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఇండస్ట్రీ పరిస్థితులపై చర్చ జరుగనున్నన్న విషయం తెలిసిందే. ఇక ఆ చర్చల అనంతరం సినిమా విడుదల తేది పై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆచార్య సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాతో బిజీ కానున్నాడు. ఆ ప్రాజెక్ట్ అనంతరం బాబీ దర్శకత్వంలో మరో మాస్ సినిమా చేయనున్న మెగాస్టార్ ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అలాగే కామెడీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











