Game Changer: రామ్ చరణ్ 80 సెకెన్ల రికార్డు.. గేమ్ చేంజర్‌లో మెయిన్ హైలైట్ ఇదే!

తెలుగు సినిమా రంగంలోకి ఎంతో మంది స్టార్ల వారసులు హీరోలుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమదైన చిత్రాలను చేస్తూ రేంజ్‌ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా వచ్చి సూపర్ స్టార్‌గా మారిపోయిన రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. పాన్ ఇండియా రేంజ్‌కు కూడా ఎదిగిపోయాడు.

వరుస హిట్లతో దూసుకుపోతోన్న రామ్ చరణ్ ఇప్పుడు 'గేమ్ చేంజర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోన్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టుపై ఆరంభం నుంచీ అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Ram Charan Non Stop Dance Moment Highlight in Game Changer Movie

'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ మూడేళ్ల క్రితమే ప్రారంభం అయింది. అప్పుడు దీన్ని 2023లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తర్వాత 2024 సంక్రాంతికి తీసుకు రావాలని అనుకున్నారు. కానీ, బ్రేకుల వల్ల చిత్రీకరణ లేట్ అవడంతో ఈ చిత్రం విడుదల సాధ్యం కాలేదు. ఫలితంగా అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దానిపై క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు.

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ ఉన్న స్టోరీలైన్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ నుంచి ఇప్పటికే ఎన్నో అంశాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ ఎంట్రీ గురించి అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అతడు హెలీకాప్టర్‌లో ఓల్డ్ సిటీలోకి ఎంట్రీ ఇచ్చే సీన్‌తో పరిచయం అవుతాడని అన్నారు. తాజాగా దీనిపై మరో సర్‌ప్రైజింగ్ న్యూస్ వైరల్ అయిపోతోంది.

Ram Charan Non Stop Dance Moment Highlight in Game Changer Movie

'గేమ్ చేంజర్' మూవీలోని ఇంట్రడక్షన్ సాంగ్‌లోనే రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తాడని తెలిసింది. ఇందులో అతడు ఏకంగా 80 సెకెన్ల పాటు నాన్ స్టాప్‌గా ఓ స్టెప్ వేయబోతున్నాడని అంటున్నారు. ఇది సినిమాలోని మేజర్ హైలైట్లలో ఒకటిగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే 'గేమ్ చేంజర్' ఇంట్రో సాంగ్‌పై చిత్ర యూనిట్ హైప్ పెంచేస్తుందని ఫిలిం నగర్‌లో చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ హీరోగా చేస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ram charan game changer s shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X