వినయ విధేయ రామ జ్యూక్ బాక్స్ విడుదల!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్ర ఆడియో జ్యూక్ బాక్స్ కొద్దిసేపటి కృతేమే విడుదయింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దేవిశ్రీ సంగీతం అందించిన ఆల్బంలో ఇప్పటికే తందానే తందానే అంటూ సాగే మొదటి పాట, తస్సాదియ్యా అంటూ సాగే మాస్ బీట్ ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా జ్యూక్ బాక్స్ రూపంలో అన్ని పాటలని విడుదల చేశారు.

ఏక్ బార్ అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా స్టెప్పులేసింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటని దేవిశ్రీ, రవీనా రెడ్డి పాడారు. దేవిశ్రీ ట్యూన్ హుషారెత్తించే విధంగా ఉంది. రామ్ లవ్స్ సీత అనే డ్యూయెట్ సాంగ్ ని చరణ్, కైరా అద్వానీ మధ్య చిత్రీకరించారు. ఈ పాటకు కూడా శ్రీమణే సాహిత్యం అందించాడు. సింహా, ప్రియా హిమేష్ ఈ పాటని పాడారు. చివరగా అమ్మా నాన్న అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ కు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కాల భైరవ ఈ సాంగ్ ని పాడడం విశేషం.

Ram Charans Vinaya Vidheya Rama juke box out

మొత్తగా దేవిశ్రీ ప్రసాద్ ఓ కమర్షియల్ చిత్రానికి అవసరమైన ఆల్బంని అందించారు. నేడు వినయ విధేయ రామ చిత్ర ఆడియో వేడుక వైభవంగా జరగనున్న నేపథ్యంలో ముందుగా పాటలని విడుదల చేయడం విశేషం. ఆడియో వేడుకలో 9 గంటలకు ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X