Game Changer: జరగండి సాంగ్ వచ్చేస్తుంది.. చరణ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అప్పుడే
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలా మంది హీరోలు దేశ వ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. తద్వారా పాన్ ఇండియా స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మద్య కాలంలో వరుస హిట్లతో సత్తా చాటుతోన్న అతడు.. RRR మూవీతో మరింత రేంజ్‌కు ఎదిగిపోయాడు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ అన్న బిరుదును సైతం దక్కించుకున్నాడు.
కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా మధ్యలో కొన్ని అనుకోని ఆటంకాలు వచ్చాయి. ఇలా ఇన్ని రోజుల వ్యవధిలో కేవలం 60 శాతానికి పైగానే షూట్‌ను పూర్తి చేసేశారు. మిగిలిన దాని కోసం ప్లాన్లు కూడా చేస్తున్నారు.

'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతోంది. అయినప్పటికీ దీని నుంచి పెద్దగా అప్‌డేట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాలోని మొదటి పాట 'జరుగండి'ని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారని ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ, అనివార్య కారణాలతో దీన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
'గేమ్ చేంజర్' సాంగ్‌ను థమన్ రీ రికార్డ్ చేస్తున్నాడని, ఇందుకోసం సింగర్‌ను కూడా మార్చాడని, అందుకే దీన్ని వాయిదా వేశారని ప్రచారం జరిగింది. దీంతో అసలు ఈ పాట ఎప్పుడు వస్తుంది అని అందరూ చర్చించుకున్నారు. దీనికితోడు రాబోయే రోజుల్లో పెద్దగా స్పెషల్ డేస్ కూడా లేకపోవడంతో జనవరి వరకూ ఈ సాంగ్ వచ్చే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీలోని 'జరగండి' పాటను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ మూడో వారంలో రానుందని అంటున్నారు. ఇది నిజంగా మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అనొచ్చు.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











